ర‌వీంద్ర‌నాథ్ రెడ్డిని టీ స‌ర్కార్ అరెస్ట్ చేయిస్తుందా?

కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే, జగన్ మేన మామ అయిన రవీంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ అనుకూల టీవీ ఛానల్ ఒక కథనాన్ని ప్రసారం చేసి హడావుడి చేసింది. రవీంద్రనాథ్ రెడ్డి అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారన్నది కథనం సారాంశం. 2012లో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో 300 గజాల భూమిని కొందరు కబ్జా చేశారట. నకిలీ పత్రాలతో స్థలాన్ని కబ్జా చేసినట్టు టీవీ ఛానల్ చెబుతోంది. ఇటీవల పోలీసులు ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడిందని కథనం. […]

Advertisement
Update:2016-05-18 15:49 IST

కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే, జగన్ మేన మామ అయిన రవీంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ అనుకూల టీవీ ఛానల్ ఒక కథనాన్ని ప్రసారం చేసి హడావుడి చేసింది. రవీంద్రనాథ్ రెడ్డి అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారన్నది కథనం సారాంశం. 2012లో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో 300 గజాల భూమిని కొందరు కబ్జా చేశారట.

నకిలీ పత్రాలతో స్థలాన్ని కబ్జా చేసినట్టు టీవీ ఛానల్ చెబుతోంది. ఇటీవల పోలీసులు ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడిందని కథనం. భూములను రెగ్యులరైజ్ చేయించుకునేందుకు రవీంద్రనాథ్ రెడ్డి ప్రయత్నించినప్పటికీ… యూఎల్సీ రికార్డుల ఆధారంగా అసలు విషయం బయటపడిందని టీవీ ఛానల్ చెబుతోంది. రెండు రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా వారు రవీంద్రనాథ్ రెడ్డి పేరును వెల్లడించారట. ఈ నేపథ్యంలోనే రవీంద్రనాథ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారని టీడీపీ అనుకూల టీవీ ఛానల్ చెబుతోంది. అయితే స్థలం విషయంలో తానే మోసపోయానని కొద్ది రోజుల క్రితం రవీంద్రనాథ్ రెడ్డే పోలీసులను ఆశ్రయించారని కూడా అదే ఛానల్ చెబుతోంది. అయితే ఈ కేసుకు అరెస్ట్ అంత సీన్ ఉంటుందా అన్నది చూడాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News