మా వాళ్ళే పోటుగాళ్లు...

నారాయణ విద్యాసంస్థల ఫ్యాకల్టీతో మున్సిపల్‌ ఉపాధ్యాయులకు ఐఐటీ ఫౌండేషన్ బ్రిడ్జి కోర్సుల శిక్షణ ఇవ్వడంపై మున్సిపల్‌ ఉపాధ్యాయులు మండిపడ్డారు. మున్సిపల్ స్కూళ్లవిద్యార్థులకు ఐఐటీ శిక్షణా తరగతుల్ని ఈనెల  15 నుంచి ప్రారంభించాలని మంత్రి నారాయణ ఆదేశించారు. ఈ నేపధ్యంలో మున్సిపల్ ఉపాధ్యాయులకు శిక్షణా తరగతుల్ని ఏర్పాటుచేశారు. లెక్కలు, సైన్స్, బయాలజీ, ఇంగ్లిష్ ఉపాధ్యాయులకు గురువారం నుంచి మూడు రోజుల పాటు పటమట జీడీఈటీ స్కూల్లో శిక్షణా తరగతుల్ని ఏర్పాటు చేశారు.  ప్రైవేట్‌ కళాశాలల ఉపాధ్యాయులతో కాకుండా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, […]

Advertisement
Update:2016-05-13 10:39 IST

నారాయణ విద్యాసంస్థల ఫ్యాకల్టీతో మున్సిపల్‌ ఉపాధ్యాయులకు ఐఐటీ ఫౌండేషన్ బ్రిడ్జి కోర్సుల శిక్షణ ఇవ్వడంపై మున్సిపల్‌ ఉపాధ్యాయులు మండిపడ్డారు. మున్సిపల్ స్కూళ్లవిద్యార్థులకు ఐఐటీ శిక్షణా తరగతుల్ని ఈనెల 15 నుంచి ప్రారంభించాలని మంత్రి నారాయణ ఆదేశించారు. ఈ నేపధ్యంలో మున్సిపల్ ఉపాధ్యాయులకు శిక్షణా తరగతుల్ని ఏర్పాటుచేశారు. లెక్కలు, సైన్స్, బయాలజీ, ఇంగ్లిష్ ఉపాధ్యాయులకు గురువారం నుంచి మూడు రోజుల పాటు పటమట జీడీఈటీ స్కూల్లో శిక్షణా తరగతుల్ని ఏర్పాటు చేశారు.

ప్రైవేట్‌ కళాశాలల ఉపాధ్యాయులతో కాకుండా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులతోనే శిక్షణ ఇప్పించాల్సిందిగా మంత్రిని ఇదివరకే కోరామని అయినా మంత్రి మొండిగా వెళ్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తాము ఐఐటీ ఫౌండేషన్ కోర్సులకు వ్యతిరేకం కాదని, ముఖ్యమంత్రికి తప్పుడు నివేదికలు ఇచ్చి ఈవిధంగా ప్రైవేట్‌ ఉపాధ్యాయులచే శిక్షణా తరగతులు ఏర్పాటుచేస్తున్నారని మండిపడ్డారు.

తాము అన్ని ఉత్తీర్ణతా పరీక్షలు, పోటీ పరీక్షలను అధిగమించే ప్రభుత్వ అధ్యాపకులుగా నియమితులయ్యామని అలాంటి తమను ప్రైవేట్ కాలేజీల టీచర్లకంటే తెలివితక్కువవాళ్ళు, సబ్జెక్టులేని మొద్దులన్నట్టు సమాజంలో ఒక తప్పుడు సంకేతం పంపేందుకు నారాయణ ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను సర్వనాశనం చేసి తన కార్పొరేట్ కాలేజీలకు మరింత క్రేజ్ పెంచుకునేందుకే మంత్రి నారాయణ ఇలాంటి దిగజారుడు ఎత్తులు వేస్తున్నారని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News