సాయిరెడ్డి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్ష‌

వైసీపీ నాయ‌కులు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌యాణిస్తున్న‌ కారు రోడ్డు ప్ర‌మాదానికి గురైన విష‌యం తెలుసుకుని పార్టీ నేత‌లు షాక్ అయ్యారు. అయితే విజ‌య‌సాయిరెడ్డి స్ప‌ల్ప‌గాయాల‌తో బ‌య‌టప‌డ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. సాయిరెడ్డికి జ‌రిగిన ప్ర‌మాదంపై వైఎస్ ఆర్‌సీపీ యూఎస్ ఏ విభాగం ఆందోళ‌న చెందింది. వెంట‌నే ఘ‌ట‌న‌పై ఆరా తీసింది. ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని వైద్యులు చెప్ప‌డంతో కుదుట‌ప‌డ్డారు. విజ‌య‌సాయిరెడ్డి త్వ‌ర‌గా కోలుకుని య‌థావిధిగా త‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని పార్టీ యూఎస్ఏ విభాగంగా ఆకాంక్షించింది. ఒక మంచి వ్య‌క్తిని […]

Advertisement
Update:2016-05-09 06:35 IST

వైసీపీ నాయ‌కులు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌యాణిస్తున్న‌ కారు రోడ్డు ప్ర‌మాదానికి గురైన విష‌యం తెలుసుకుని పార్టీ నేత‌లు షాక్ అయ్యారు. అయితే విజ‌య‌సాయిరెడ్డి స్ప‌ల్ప‌గాయాల‌తో బ‌య‌టప‌డ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. సాయిరెడ్డికి జ‌రిగిన ప్ర‌మాదంపై వైఎస్ ఆర్‌సీపీ యూఎస్ ఏ విభాగం ఆందోళ‌న చెందింది. వెంట‌నే ఘ‌ట‌న‌పై ఆరా తీసింది. ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని వైద్యులు చెప్ప‌డంతో కుదుట‌ప‌డ్డారు. విజ‌య‌సాయిరెడ్డి త్వ‌ర‌గా కోలుకుని య‌థావిధిగా త‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని పార్టీ యూఎస్ఏ విభాగంగా ఆకాంక్షించింది. ఒక మంచి వ్య‌క్తిని క్షేమంగా కాపాడిన భ‌గ‌వంతుడికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్టు విభాగం స‌భ్యులు తెలిపారు. ప్ర‌స్తుతం విజ‌య‌సాయిరెడ్డి అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కాకినాడలో జ‌రుగుతున్న వైసీపీ ధ‌ర్నాలో పాల్గొనేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తున్న స‌మ‌యంలో విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌యాణిస్తున్న స్కార్పియో వాహ‌నం ప్ర‌మాదానికి గురైంది. వ‌ర్ష‌పు నీరు కార‌ణంగా రోడ్డుపై అదుపు త‌ప్పి ప‌ల్టీ కొట్టింది. విజ‌య‌సాయిరెడ్డి అదృష్టవశాత్తు డివైడ‌ర్ మ‌ధ్య‌లో ఉన్న మ‌ట్టిపై ప‌డ్డారు. దీంతో స్వ‌ల్ప గాయాలు అయ్యాయి.

Tags:    
Advertisement

Similar News