‘’నా భార్య కూడా కాపు కాదు… పవన్ వచ్చినా సరే వారికే నష్టం!’’

బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని తాము కోరుకోవడం లేదని… ఒక వేళ ఆ పరిస్థితి వస్తే బీజేపీకే తీవ్ర నష్టమని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన గంటా శ్రీనివాసరావు… ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీ నష్టపోతుందన్నారు. బీజేపీ తరపున పవన్ కల్యాణ్ వచ్చినా తమకేమీ ఇబ్బంది లేదని.. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నష్టం బీజేపీకే ఉంటుందన్నారు.  బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం తమకు నిమిషంలో పని అన్నారు. కాపులు టీడీపీ నుంచి దూరంగా కావాల్సిన అవసరం […]

Advertisement
Update:2016-05-07 08:31 IST

బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని తాము కోరుకోవడం లేదని… ఒక వేళ ఆ పరిస్థితి వస్తే బీజేపీకే తీవ్ర నష్టమని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన గంటా శ్రీనివాసరావు… ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీ నష్టపోతుందన్నారు. బీజేపీ తరపున పవన్ కల్యాణ్ వచ్చినా తమకేమీ ఇబ్బంది లేదని.. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నష్టం బీజేపీకే ఉంటుందన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం తమకు నిమిషంలో పని అన్నారు.

కాపులు టీడీపీ నుంచి దూరంగా కావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎవరైనా కాపులకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారా?, కార్పొరేషన్ ఏర్పాటు చేశారా? అందుకు వెళ్లి కోట్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. అవన్నీ చంద్రబాబు చేశారన్నారు. కాబట్టి కాపులు దూరం కావాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరే సమయంలో చిరుకు ఆ విషయం చెప్పానని అప్పుడు తామిద్దరు కౌంగిలించుకుని కంటతడి పెట్టుకున్నామన్నారు.

వచ్చే ఎన్నికల్లో జగనే పోటీ దారుగా ఉంటే తామూ ఈజీగా గెలుస్తామని చెప్పారు. కాపులకు నాయకుడు కావాలనుకుంటున్నారా అన్న ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పారు గంటా. తన భార్యతో సహా వ్యాపార భాగస్వామి, మేజారిటీ స్నేహితులు కాపులు కాదని చెప్పారు. తాను చంద్రబాబు పెంచిన మొక్కనని గంటా అన్నారు. విభజన హామీలపై కేంద్రం మోసం చేయడం సరికాదన్నారు.

click to read-

Tags:    
Advertisement

Similar News