మాచర్లలో జగన్‌ ధర్నా

కరువు నివారణ చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాడాలని వైసీపీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మే 2న రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల ముందు ధర్నా చేయాలని వైసీపీ నిర్ణయించింది. గుంటూరు జిల్లా మాచర్లలో జరిగే ధర్నాలో జగన్ పాల్గొంటారని వైసీపీ నేత పార్థసారధి తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ధర్నా చేస్తారని చెప్పారు. జేసీ దివాకర్‌ రెడ్డిపైనా పార్థ సారథి సెటైర్లు వేశారు. ఒక ఎంపీ రెండేళ్లలో అనంతపురం జిల్లాను చంద్రబాబు […]

Advertisement
Update:2016-04-29 09:12 IST

కరువు నివారణ చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాడాలని వైసీపీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మే 2న రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల ముందు ధర్నా చేయాలని వైసీపీ నిర్ణయించింది. గుంటూరు జిల్లా మాచర్లలో జరిగే ధర్నాలో జగన్ పాల్గొంటారని వైసీపీ నేత పార్థసారధి తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ధర్నా చేస్తారని చెప్పారు.

జేసీ దివాకర్‌ రెడ్డిపైనా పార్థ సారథి సెటైర్లు వేశారు. ఒక ఎంపీ రెండేళ్లలో అనంతపురం జిల్లాను చంద్రబాబు కోనసీమ కన్నా పచ్చగా మార్చేస్తారని అంటున్నారని… కానీ ప్రస్తుతం అనంతపురం జిల్లాలో తాగేందుకు మంచినీరు కూడా లేవని అన్నారు. ప్రస్తుతం అక్కడి ప్రజలను కరువు నుంచి కాపాడాల్సిందిగా కోరుతుంటే రెండేళ్ల తర్వాత కోనసీమను చూపిస్తామంటూ జేసీలాంటి వారు ప్రజలను ఊహాలోకంలో విహరింపచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. చాలా ప్రాంతాలలో పశువులకు గడ్డి కూడా దొరకడం లేదన్నారు.

అలాంటి ప్రాంతాలకు పశుగ్రాసం తరలించాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా ఉంటోందని పార్థసారథి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో పార్టీలో ఉండి..టికెట్ల కేటాయింపులోనూ పాలుపంచుకున్న మైసూరారెడ్డి స్వార్థప్రయోజనాల కోసమే వెళ్తూ అబాండాలు వేశారని పార్థసారథి విమర్శించారు. పార్టీ వీడే నేతలంతా దిగజారి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News