దొరా... చేతనైతే వెళ్లి చంద్రబాబును అడుగు..!

సేవ్ డెమొక్రసీ పేరుతో ఢిల్లీలో జాతీయ నేతలను కలుస్తున్న జగన్… సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. చంద్రబాబు అవినీతిని జగన్‌ విమర్శిస్తున్న సమయంలో ఒక విలేకరి పదేపదే అడ్డుతగిలారు.  గతంలో మీపై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మీరు కూడా చంద్రబాబుపై లక్ష 34 వేల కోట్ల అవినీతి ఆరోపణలు చేస్తున్నట్టుగా ఉందని ఒక విలేకరి అన్నారు. దీనికి జగన్ కాసింత ఘాటుగానే […]

Advertisement
Update:2016-04-26 15:29 IST

సేవ్ డెమొక్రసీ పేరుతో ఢిల్లీలో జాతీయ నేతలను కలుస్తున్న జగన్… సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. చంద్రబాబు అవినీతిని జగన్‌ విమర్శిస్తున్న సమయంలో ఒక విలేకరి పదేపదే అడ్డుతగిలారు. గతంలో మీపై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మీరు కూడా చంద్రబాబుపై లక్ష 34 వేల కోట్ల అవినీతి ఆరోపణలు చేస్తున్నట్టుగా ఉందని ఒక విలేకరి అన్నారు. దీనికి జగన్ కాసింత ఘాటుగానే సమాధానం చెప్పారు.

‘’ దొరా.. మేం ఊరికినే ఆరోపణలు చేయడం లేదు. జీవోలు చూపిస్తున్నాం. సాక్ష్యాలు చూపిస్తున్నాం. పదేపదే ప్రతిప్రక్షాన్ని ప్రశ్నించడం కాదు. చేతనైతే వెళ్లి చంద్రబాబును ప్రశ్నించు. తనపై వస్తున్న ఆరోపణలపై ఎందుకు విచారణ జరిపించుకోవడం లేదో!. కేసులు వేసిన ప్రతిసారి స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారో వెళ్లి అడుగు. నా మీద ఆరోపణలు వచ్చాయి. దైర్యంగా ఎదుర్కొన్నాం. దర్యాప్తులు జరిగాయి. కోర్టులో విచారణ జరుగుతోంది. ధైర్యంగా ఇప్పటికీ పోరాడుతున్నాం. నా మీద కేసులు వేసింది ఇదే చంద్రబాబు, సోనియాగాంధీ. కానీ ఎక్కడా వెనక్కు తగ్గలేదు మేం. చంద్రబాబు మాత్రం వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిసారి స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారో వెళ్లి అడుగు’’ అని జగన్ బదులిచ్చారు. అయినా సదరు విలేకరి మరోసారి స్పందిస్తూ.. ”చంద్రబాబు ప్రతిఏటా తన ఆస్తుల వివరాలు ప్రకటిస్తున్నారు కదా… అవినీతిపరుడు ఎలా అవుతారు” అంటూ బాబును వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు.

రాష్ట్రంలో కొన్ని చంద్రబాబుకు సంబంధించిన సోదర మీడియా సంస్థలు, కొందరు చంద్రబాబు సోదర జర్నలిస్టులు… ఆయన చేసే ఫిరాయింపు రాజకీయాలను సమర్దించడం దురదృష్టకరమని జగన్ అన్నారు. కొన్ని మీడియా ఛానళ్లు పని కట్టుకుని ఆ ఎమ్మెల్యే వెళ్లిపోతున్నారు.. ఈ ఎమ్మెల్యే వెళ్లిపోతున్నారు అంటూ అదేదో ఘనకార్యం అయినట్టుగా ప్రచారం చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడం ఎవరూ చేసినా అది తప్పే అవుతుందన్నారు జగన్. అది ముమ్మాటికి రాజకీయ వ్యభిచారమే అవుతుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు చేస్తున్న తప్పుడు పనులను మీడియా బాధ్యతతో ప్రశ్నించాలని జగన్ కోరారు. లేకుంటే ఇదో సాంప్రదాయంగా మారుతుందన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News