ఫ్లాప్ కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది
సర్దార్ సినిమాలనే సరైనోడు సినిమా కూడా ముక్కలు ముక్కలుగా చూస్తే బాగుందనిపిస్తుంది. కానీ రెండున్నర గంటలు థియేటర్లలో కూర్చొని చూడాలంటే చిరాకేస్తుంది. బోయపాటి హై-ఓల్టేజ్ యాక్షన్ డ్రామాను రక్తికట్టించడానికి బన్నీ నానా పాట్లు పడినప్పటికీ… ఆ ఫీట్లను ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. హెవీ యాక్షన్ లో బన్నీని ఊహించుకోలేకపోయారు. మరీ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు సెట్ అయ్యే ఎపిసోడ్స్ లో బన్నీని ఇరికించే ప్రయత్నం చేశారని విమర్శిస్తున్నారు. ఏదే ఏమైనా సరైనోడుకు మాత్రం ఇప్పుడు వసూళ్లు పెద్దగా […]
సర్దార్ సినిమాలనే సరైనోడు సినిమా కూడా ముక్కలు ముక్కలుగా చూస్తే బాగుందనిపిస్తుంది. కానీ రెండున్నర గంటలు థియేటర్లలో కూర్చొని చూడాలంటే చిరాకేస్తుంది. బోయపాటి హై-ఓల్టేజ్ యాక్షన్ డ్రామాను రక్తికట్టించడానికి బన్నీ నానా పాట్లు పడినప్పటికీ… ఆ ఫీట్లను ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. హెవీ యాక్షన్ లో బన్నీని ఊహించుకోలేకపోయారు. మరీ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు సెట్ అయ్యే ఎపిసోడ్స్ లో బన్నీని ఇరికించే ప్రయత్నం చేశారని విమర్శిస్తున్నారు. ఏదే ఏమైనా సరైనోడుకు మాత్రం ఇప్పుడు వసూళ్లు పెద్దగా లేవు. డిమాండ్ తగ్గిపోయింది. తగ్గిన డిమాండ్ ను మళ్లీ పెంచేందుకు హీరో-దర్శకుడు మళ్లీ ప్రచారం షురూ చేశారు. వర్కింగ్ డేస్ లో సినిమాకు వసూళ్లు రాబట్టాలంటే తప్పనిసరిగా ప్రచారం ఉండాలనే ఉద్దేశంతో…. ప్రతి ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు .కానీ అటు అల్లుఅర్జున్, ఇటు బోయపాటి ముఖాల్లో ఫ్లాపు కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయిపోయిన పెళ్లికి ఇంకా బాజాలా అనే విధంగా ఇద్దరూ స్టుడియోల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. వీళ్ల ఇంటర్వ్యూలు చూసిన జనాలు నిజంగానే సినిమాకు వెళ్లకపోవడమే మంచిదనే ఫీలింగ్ కు వచ్చేశారు.