జనతా గ్యారేజీలో వేలు పెడుతున్న ఎన్టీఆర్

ఓ ప్రాజెక్టులో హీరో అడుగుపెట్టాడంటే అతడికి చాలా హక్కులు వచ్చేస్తాయి. అవసరమనుకుంటే కథ, స్క్రీన్ ప్లే లో మార్పులు చెబుతాడు. పవన్ లాంటి నటుడైతే డాన్స్, ఫైట్స్ లో కూడా తన మార్క్ ఉండాలనుకుంటాడు. కానీ ఇప్పటివరకు మార్కెటింగ్ లో హీరోలు వేలుపెట్టిన ఉదంతాలు మాత్రం కనిపించలేదు. ఫస్ట్ టైం ఎన్టీఆర్ విషయంలో ఇది జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజీ సినిమా చేస్తున్న ఎన్టీఆర్…. ఈ సినిమా కథ, కథనాల్ని దర్శకుడికే వదిలేసినప్పటికీ… మార్కెటింగ్ […]

Advertisement
Update:2016-04-26 04:40 IST

ఓ ప్రాజెక్టులో హీరో అడుగుపెట్టాడంటే అతడికి చాలా హక్కులు వచ్చేస్తాయి. అవసరమనుకుంటే కథ, స్క్రీన్ ప్లే లో మార్పులు చెబుతాడు. పవన్ లాంటి నటుడైతే డాన్స్, ఫైట్స్ లో కూడా తన మార్క్ ఉండాలనుకుంటాడు. కానీ ఇప్పటివరకు మార్కెటింగ్ లో హీరోలు వేలుపెట్టిన ఉదంతాలు మాత్రం కనిపించలేదు. ఫస్ట్ టైం ఎన్టీఆర్ విషయంలో ఇది జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజీ సినిమా చేస్తున్న ఎన్టీఆర్…. ఈ సినిమా కథ, కథనాల్ని దర్శకుడికే వదిలేసినప్పటికీ… మార్కెటింగ్ లో మాత్రం తనదైన ముద్ర చూపిస్తున్నాడట.

మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాతల్ని పిలిచి మరీ, తను చెప్పిన వ్యక్తులకే పంపిణీ హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడట. స్వయంగా హీరో గారు రంగంలోకి దిగి ఆదేశాలు ఇస్తుంటే…. నిన్నగాక మొన్నొచ్చిన మైత్రీ మూవీస్ లాంటి చిన్న బ్యానర్ చేసేదేముంది… అందుకే తక్కువ రేటుకు తారక్ చెప్పిన వ్యక్తులకు పంపిణీ హక్కులు ఇచ్చేస్తున్నారట. మరోవైపు సినిమా నిర్మాణ వ్యయం రోజురోజుకు పెరిగిపోతోందట. సారధి స్టుడియోలో గ్యారేజీ సెట్ కే భారీ ఖర్చుపెట్టిన నిర్మాతలు…. తాజాగా ఓ ఇంటి సెట్ కోసం ఏకంగా 2 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారట. కానీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మాత్రం ఎక్కువకు అమ్ముకునే వీలు లేకుండా పోతోందని బాధపడుతున్నారట.

Tags:    
Advertisement

Similar News