సుప్రీంలో రోజాకు ఊరట, స్పీకర్ కు 8వారాల గడువు

అసెంబ్లీ నుంచి ఏడాది పాటు రోజా సస్పెన్షన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. సుప్రీం కోర్టు సూచన మేరకు రోజా వివరణ లేఖను కోర్టుకు సమర్పించారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రోజా వివరణ లేఖలో చెప్పారు. రోజా ఇచ్చిన వివరణ లేఖపై 8 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను కోర్టు ఆదేశించింది. స్పీకర్ నిర్ణయం తీసుకోని పక్షంలో ఈ అంశంపై తామే మరోసారి విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీలోని వైసీపీ కార్యాలయంలోకి […]

Advertisement
Update:2016-04-22 08:14 IST

అసెంబ్లీ నుంచి ఏడాది పాటు రోజా సస్పెన్షన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. సుప్రీం కోర్టు సూచన మేరకు రోజా వివరణ లేఖను కోర్టుకు సమర్పించారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రోజా వివరణ లేఖలో చెప్పారు.

రోజా ఇచ్చిన వివరణ లేఖపై 8 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను కోర్టు ఆదేశించింది. స్పీకర్ నిర్ణయం తీసుకోని పక్షంలో ఈ అంశంపై తామే మరోసారి విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీలోని వైసీపీ కార్యాలయంలోకి రోజాను అనుమతించాలని కోర్టు ఆదేశించింది.

ఇదివరకు రోజాను అసెంబ్లీ ప్రాంగణంలోకి కూడా రాకుండా అడ్డుకున్నారు. సుప్రీం ఆదేశంతో రోజా ఇకపై అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చే వీలుంటుంది. అయితే గతంలో ఒకసారి రోజాపై సస్పెన్షన్ హైకోర్టు ఎత్తివేసినా.. ఆమెను సభలోకే కాకుండా అసెంబ్లీ ప్రాంగణంలోకి కూడా రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు సుప్రీం తీర్పునైనా ప్రభుత్వం అమలు చేస్తుందో లేదో చూడాలి. తదుపరి విచారణను కోర్టు ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News