తమన్నా పెళ్లి రూమర్స్ నిజమేనా..?
టాలీవుడ్ లో సెల్ఫ్ మేడ్ అనిపించుకున్న సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. పోయిన చోటే వెతుకోవాలన్నట్లు.. టాలీవుడ్ లో తనకు బ్యాడ్ టైమ్ నడుస్తున్న టైమ్ లో కోలీవుడ్ లో వరస చిత్రాలు చేసి అగ్ర నటి అనిపించుకుంది. ఆ తరువాత సకుమార్ 100 పర్సెంట్ లవ్ చిత్రంతో ఆడియన్స్ ను మెప్పించింది. ఆ చిత్రం హిట్ కావడంతో తమన్నాకు తెలుగు స్టార్ హీరోలందరు పోటి పడి ఆఫర్స్ ఇచ్చారు. కట్ చేస్తే ప్రస్తుతం బాహుబలి […]
టాలీవుడ్ లో సెల్ఫ్ మేడ్ అనిపించుకున్న సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. పోయిన చోటే వెతుకోవాలన్నట్లు.. టాలీవుడ్ లో తనకు బ్యాడ్ టైమ్ నడుస్తున్న టైమ్ లో కోలీవుడ్ లో వరస చిత్రాలు చేసి అగ్ర నటి అనిపించుకుంది. ఆ తరువాత సకుమార్ 100 పర్సెంట్ లవ్ చిత్రంతో ఆడియన్స్ ను మెప్పించింది. ఆ చిత్రం హిట్ కావడంతో తమన్నాకు తెలుగు స్టార్ హీరోలందరు పోటి పడి ఆఫర్స్ ఇచ్చారు. కట్ చేస్తే ప్రస్తుతం బాహుబలి చిత్రం ఇచ్చిన క్రేజ్ తో మరింత కాన్ఫిడెంట్ గా దూసుకెళ్తుంది.
అటు హిందిలోను..ఇటు కోలీవుడ్ లో కూడా చిత్రాలు చేస్తుంది. కట్ చేస్తే.. ఈ ముద్దుగుమ్మ గత కొంత కాలంగా ముంబాయి్ కి చెందిన ఒక సాప్ట్ వేర్ ఇంజినీర్ తో క్లోజ్ గా ఉంటుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తను చేస్తున్న చిత్రాలు కంప్లీట్ అవ్వగానే పెళ్లి చేసుకుని సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. నటిగా మంచి స్టేజ్ లో వున్న ఈ హాట్ బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెబుతుందా అనేది ప్రశ్నార్ధకమే మరి.