మొత్తానికి మరో బ్రాండ్ పట్టాడు...

ఈమధ్య కాలంలో వాణిజ్య ప్రకటనలన్నీ చెర్రీకి చాలా దూరం జరిగాయి. కుదిరితే మహేష్ బాబు.. కుదరకపోతే అఖిల్ తో మాత్రమే యాడ్స్ చేసేందుకు కార్పొరేట్ సంస్థలు ఇంట్రెస్ట్ చూపించాయి. అలా ఈమధ్య కాలంలో యాడ్స్ కు చెర్రీ చాలా దూరం అయిపోయాడు. ఎట్టకేలకు ఓ బ్రాండ్ పట్టుకున్నాడు. తన మామయ్యకు చెందిన అపోలో సంస్థకు చెందిన ఓ విభాగానికి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసేందుకు చెర్రీ అంగీకరించాడు. అపోలో-జియో అనే సరికొత్త కార్యక్రమాన్ని ఆ సంస్థ ప్రారంభించింది. […]

Advertisement
Update:2016-04-16 13:38 IST
ఈమధ్య కాలంలో వాణిజ్య ప్రకటనలన్నీ చెర్రీకి చాలా దూరం జరిగాయి. కుదిరితే మహేష్ బాబు.. కుదరకపోతే అఖిల్ తో మాత్రమే యాడ్స్ చేసేందుకు కార్పొరేట్ సంస్థలు ఇంట్రెస్ట్ చూపించాయి. అలా ఈమధ్య కాలంలో యాడ్స్ కు చెర్రీ చాలా దూరం అయిపోయాడు. ఎట్టకేలకు ఓ బ్రాండ్ పట్టుకున్నాడు. తన మామయ్యకు చెందిన అపోలో సంస్థకు చెందిన ఓ విభాగానికి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసేందుకు చెర్రీ అంగీకరించాడు. అపోలో-జియో అనే సరికొత్త కార్యక్రమాన్ని ఆ సంస్థ ప్రారంభించింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురు దీపక్ చోప్రాకు చెందిన జియోతో ఒప్పందం కుదుర్చుకొని ఇలా అపోలో-జియోగా ఏర్పడింది. దీనికి సంబంధించిన యాప్ ను ఆవిష్కరించేందుకు చెర్రీ ముందుకొచ్చాడు. భవిష్యత్తులో అపోలే-జియో కార్యక్రమాాలకు ప్రచార కర్తగా కూడా వ్యవహరించడానికి సిద్ధమయ్యాడు. మొత్తానికి చెర్రీ ఖాతాలో ఓ సంస్థ చేరింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News