ప్రియాంక నా విలువని పెంచాల్సిన పనిలేదు!
నా కుటుంబం నుండి నాకు అందిన హోదా, విలువలు చాలు… ప్రియాంక వాటిని పెంచాల్సిన అవసరం లేదు…. సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త అయిన రాబర్డ్ వాద్రా మాటలివి. తన జీవితంలో తనకు అన్నీ సరిపడా ఉన్నాయని, తన తండ్రి తనకిచ్చిన చదువు, సంస్కారం, సమస్యలను ఎదుర్కొనే శక్తి ఇవన్నీ తనకు సరిపడా ఉన్నాయని, ప్రియాంక కారణంగా తాను జీవితంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తనకు దేశం వదిలి వెళ్లాల్సిన […]
నా కుటుంబం నుండి నాకు అందిన హోదా, విలువలు చాలు… ప్రియాంక వాటిని పెంచాల్సిన అవసరం లేదు…. సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త అయిన రాబర్డ్ వాద్రా మాటలివి. తన జీవితంలో తనకు అన్నీ సరిపడా ఉన్నాయని, తన తండ్రి తనకిచ్చిన చదువు, సంస్కారం, సమస్యలను ఎదుర్కొనే శక్తి ఇవన్నీ తనకు సరిపడా ఉన్నాయని, ప్రియాంక కారణంగా తాను జీవితంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తనకు దేశం వదిలి వెళ్లాల్సిన అవసరం కూడా లేదని, అలా ఎప్పుడూ చేయనని ఆయన అన్నారు.
హర్యానా ప్రభుత్వం తనపై ఎన్ని ఆరోపణలు చేసినా వాటిని తీసుకుని, భరించగల శక్తి తనకున్నదని, అది తనకు తన కుటుంబం నుండి వచ్చిందని ఆయన అన్నారు. హర్యానాలో గత కాంగ్రెస్ ప్రభుత్వం, వాద్రాకి, డిఎల్ఎఫ్ గృహనిర్మాణ సంస్థకు మధ్య జరిగిన భూ లావాదేవీల విషయంలో అనుకూలంగా వ్యవహరించిందని కాగ్ నివేదికలో పేర్కొన్న దరిమిలా ఒక ఏక సభ్య కమిషన్ ఈ విషయంపై విచారణ జరుపుతోంది.ఈ నేపథ్యంలో వాద్రా ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, రానని చెప్పలేనని, భవిష్యత్తు తనకోసం ఏం దాచి ఉంచిందో తెలియదుకదా అన్నారు. తాను దేశానికి అత్యంత ముఖ్యమైన ఓ కుటుంబంలో భాగమై ఉన్న సంగతి తనకు తెలుసునని, ఆ విషయంలో బాధ్యతగా ఉంటానని రాబర్డ్ వాద్రా అన్నారు.
Click on Image to Read: