రైలొచ్చింది...నీళ్లు తెచ్చింది.... మహారాష్ట్రలో మొట్టమొదటి... నీళ్ల రైలు...!
నీటి కరువు అనేది అనుభవించిన వారికే తెలుస్తుంది. ప్రజలను నీటి కష్టాలనుండి బయటపడేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. కరువున్న ప్రాంతాలకు నీళ్లను రైలు వ్యాగన్ల ద్వారా పంపుతున్నారు. ఈ నేపథ్యంలో 50 నీళ్ల వ్యాగన్ల రైలు ఒకటి సోమవారం ఉదయానికి లాతూర్ చేరేలా బయలుదేరింది. దీని ద్వారా 2.75 లక్షల లీటర్ల నీటిని, కరువుని ఎదుర్కొంటున్న మరట్వాడా ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంధనం, నూనెలను చేరవేసే వ్యాగన్లను ఆవిరితో శుభ్రం చేసి వాటి […]
నీటి కరువు అనేది అనుభవించిన వారికే తెలుస్తుంది. ప్రజలను నీటి కష్టాలనుండి బయటపడేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. కరువున్న ప్రాంతాలకు నీళ్లను రైలు వ్యాగన్ల ద్వారా పంపుతున్నారు. ఈ నేపథ్యంలో 50 నీళ్ల వ్యాగన్ల రైలు ఒకటి సోమవారం ఉదయానికి లాతూర్ చేరేలా బయలుదేరింది. దీని ద్వారా 2.75 లక్షల లీటర్ల నీటిని, కరువుని ఎదుర్కొంటున్న మరట్వాడా ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంధనం, నూనెలను చేరవేసే వ్యాగన్లను ఆవిరితో శుభ్రం చేసి వాటి ద్వారా నీటిని పంపుతున్నారు.
మరట్వాడా ప్రాంతాల్లో డ్యాములు ఎండిపోయి జనం నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 10-12 రోజులకు ఒకసారి అక్కడి ప్రజలకు మంచినీరు అందుతోంది. అందుకే ప్రభుత్వ యంత్రాంగం రైలుద్వారా నీటిని అందించాలనే నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర పశ్చిమ ప్రాంతానికి చెందిన సంగ్లి జిల్లా అధికారులు ఇందుకోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. 2,700మీటర్ల నీటి సప్లయి లైనుని నిర్మించి, రైల్వే ఫిల్టర్ హౌస్ నుండి రేల్వే యార్డుకి నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులకు మొత్తం రూ 1.84 కోట్లు ఖర్చుకానుంది. శనివారం ఉదయం మొదలైన ఈ పనులు పూర్తి కావడానికి నాలుగునుండి ఆరురోజుల సమయం పడుతుందని సంగ్లి జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ట్రయిల్‌గా వ్యాగన్లలో నీటిని నింపి పంపామని, మరో అయిదారు రోజుల్లో ఈ జిల్లానుండి నీరు క్రమం తప్పకుండా మరట్వాడా కరువు జిల్లాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆ కలెక్టరు వెల్లడించారు.