అయ్యో పాపం... ఇలియానా
ఒకప్పుడు తెలుగులో ఓ వెలుగువెలిగింది ఇలియాన. బడా హీరోలతో సమానంగా స్టార్ స్టేటస్ అనుభవించింది. ఆమె కాల్షీట్ల కోసం హీరోలు క్యూ కట్టేవాళ్లు. అలా ఒక దశలో భలే దొంగలు అనే సినిమాకు ఏకంగా కోటిన్నర వరకు పారితోషికం తీసుకుంది ఇలియాన. కాకపోతే బాలీవుడ్ మెరుపుకలలు ఆమెను తెలుగులో ఉండనివ్వలేదు. హిందీ సినిమాల వెంట పడేలా చేశాయి. దీంతో బాలీవుడ్ కు వెళ్లిపోయిన ఈ గోవా బ్యూటీ… అక్కడ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా ఇటీవల ఆమె […]
Advertisement
ఒకప్పుడు తెలుగులో ఓ వెలుగువెలిగింది ఇలియాన. బడా హీరోలతో సమానంగా స్టార్ స్టేటస్ అనుభవించింది. ఆమె కాల్షీట్ల కోసం హీరోలు క్యూ కట్టేవాళ్లు. అలా ఒక దశలో భలే దొంగలు అనే సినిమాకు ఏకంగా కోటిన్నర వరకు పారితోషికం తీసుకుంది ఇలియాన. కాకపోతే బాలీవుడ్ మెరుపుకలలు ఆమెను తెలుగులో ఉండనివ్వలేదు. హిందీ సినిమాల వెంట పడేలా చేశాయి. దీంతో బాలీవుడ్ కు వెళ్లిపోయిన ఈ గోవా బ్యూటీ… అక్కడ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా ఇటీవల ఆమె చేసిన సినిమా డిజాస్టర్ అవ్వడంతో బాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు ఇచ్చేవాళ్లు కరువయ్యారు. దీంతో ఆమె మరోసారి టాలీవుడ్ కు వచ్చేందుకు సిద్ధమౌతోంది. అయితే మొన్నటి వరకు ఆమె వస్తుందని కళ్లుకాయలు కాచేలా ఎదురుచూసిన హీరోలు ఇప్పుడు మాత్రం ఆమెను పట్టించుకోవడం లేదు. దీంతో ఇలియానా తన పారితోషికాన్ని సగానికి సగం తగ్గించేసుకుందట. ఎవరైనా అవకాశం ఇస్తే…. దాదాపు 50లక్షలకు అటుఇటుగానే సినిమా చేసే ఆలోచలో ఉందట. కనీసం ఈ ఆఫర్ అయినా మన తెలుగు మేకర్స్ ను ఎట్రాక్ట్ చేస్తుందేమో చూడాలి.
Advertisement