ఆ మీసాలోడిని వదిలెయ్… మంత్రి పదవి ఇస్తామన్నారు...

టీడీపీలో చేరిన కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్… వైఎస్‌తో తనకున్న అనుభవాల గురించి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది వైఎస్సేనన్నారు. వైఎస్‌ తొలిసారి పోటీ చేసినప్పుడు ఆయన తరపున తాను ప్రచారంలో పాల్గొన్నానని చెప్పారు. తనను ఎంపీని చేస్తానని చెప్పిన  వైఎస్‌, మాట నిలుపుకుంటూ తనతో  చెప్పకుండానే  అభ్యర్థిగా తనను ఎంపిక చేశారన్నారు. అయితే నామినేషన్ వేసేందుకు తాను వెనుకాడానని… ‘’నీవు నామినేషన్ వేయకపోతే కాస్త విషం ఇవ్వు” అని వైఎస్‌ అన్నారు… […]

Advertisement
Update:2016-03-28 14:50 IST

టీడీపీలో చేరిన కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్… వైఎస్‌తో తనకున్న అనుభవాల గురించి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది వైఎస్సేనన్నారు. వైఎస్‌ తొలిసారి పోటీ చేసినప్పుడు ఆయన తరపున తాను ప్రచారంలో పాల్గొన్నానని చెప్పారు. తనను ఎంపీని చేస్తానని చెప్పిన వైఎస్‌, మాట నిలుపుకుంటూ తనతో చెప్పకుండానే అభ్యర్థిగా తనను ఎంపిక చేశారన్నారు. అయితే నామినేషన్ వేసేందుకు తాను వెనుకాడానని… ‘’నీవు నామినేషన్ వేయకపోతే కాస్త విషం ఇవ్వు” అని వైఎస్‌ అన్నారు… నేను వెంటనే “నీ కోసం ప్రాణమైనా ఇస్తాను రాజా’’ అని అన్నానని గుర్తు చేసుకున్నారు.

ఢిల్లీలో ఒకప్పుడు హైకమాండ్‌ పెద్దలు వైఎస్‌కు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిప్పుకునేవారని… ఆ సమయంలో వైఎస్ చాలా బాధపడేవారన్నారు. జనం కోసం ఏమైనా చేయాలన్న తపన వైఎస్‌లో అణుక్షణం ఉండేదన్నారు. వైఎస్‌ అంటే అప్పటి ప్రధాని పీవీ నర్సింహరావుకు అస్సలు పడేది కాదన్నారు. ఒక రోజు రాత్రి ఒంటి గంటకు పీవీ ఫోన్ చేసి ఉదయం బ్రేక్‌పాస్ట్‌కు ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారన్నారు. తాను వెళ్లగా టిఫిన్ పెట్టి ఆ వెంటనే ‘’ఆ మీసాలోడిని(వైఎస్‌) వదిలేయ్ సాయిప్రతాప్… నిన్ను వెంటనే కేబినెట్‌లోకి తీసుకుంటా’’ అని పీవీ అన్నారని చెప్పారు. వెంటనే తాను’’ మీరు ఈ విషయం ఒక ఐదు నిమిషాలు ముందు చెప్పి ఉంటే ఈ టిఫిన్‌ కూడా చేసేవాడిని కాదు సార్‌’’ అని అన్నానన్నారు. పీవీ గారు ప్రశాంతంగానే భుజం తట్టి పంపించారన్నారు.

ఢిల్లీలో అధికారులు తన మాట వినని సమయంలో వైఎస్‌ను తీసుకెళ్లేవాడినని… ఆయన గట్టిగా మాట్లాడి పని జరిగేలా చేసేవారన్నారు. వైఎస్‌ అంటే ఢిల్లీ నేతల్లో చాలా మందికి పడేది కాదన్నారు. నిరంతరం వైఎస్‌కు వ్యతిరేకంగా సోనియా దగ్గర లేనిపోనివి చెప్పేవారన్నారు. వైఎస్ ఎంపీగా ఉన్న సమయంలోనూ జగన్ వ్యాపారంలో నిలదొక్కుకున్నాడని… ఆ సమయంలో ‘’నా కొడుకు యోగ్యుడయ్యాడు సాయి.. ఇక మనకు డబ్బు ఇబ్బంది లేదు’’ అంటూ వైఎస్ సంతోషించేవారన్నారు. జగన్, వైఎస్ మధ్య ఘర్షణ వాతావరణం తానెప్పుడూ చూడలేదన్నారు. ఇద్దరు అప్యాయంగానే ఉండేవారన్నారు.

తన జీవితాంతం వైఎస్‌ కుటుంబంతోనే ఉండాలనుకున్నానని.. కానీ జగన్‌ తనకు ఆ అవకాశం ఇవ్వలేదన్నారు. అందుకు ఇప్పటికీ గుండెల్లో బాధగా ఉందన్నారు. శత్రువు వచ్చినా సాయం చేసే గుణం వైఎస్‌లో చూశానన్నారు. కడప జిల్లాలో ఇద్దరు వైఎస్ ప్రత్యర్థి నాయకులు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో… వారి గురించి తెలుసుకుని వైఎస్ వెంటనే “నేనున్నాను కదా’’ అంటూ సాయం చేశారని సాయిప్రతాప్ చెప్పారు. చెంచాలు ఎక్కువైపోవడం వల్లే కాంగ్రెస్ పరిస్థితి ఇలా తయారైందన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News