ఆ ఎనిమిది మంది ఎక్కడున్నారు అధ్యక్షా! నాడు సోనియా సంతకం చేశారా అధ్యక్షా!

ప్రభుత్వంపై వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ ఆసక్తికర పరిణామాల మధ్య ప్రారంభమైంది. తీర్మానంపై జగన్‌ మాట్లాడేందుకు సిద్ధమవగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల అభ్యంతరం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానం ఇచ్చిన వ్యక్తే తొలుత చర్చ ప్రారంభించాలని అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో వైసీపీ డిప్యూటీ ప్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు చర్చను మొదలుపెట్టారు. తమ పార్టీ తరపున ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతారని చెప్పారు. ఇంతలో యనమల మళ్లీ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. […]

Advertisement
Update:2016-03-14 07:45 IST

ప్రభుత్వంపై వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ ఆసక్తికర పరిణామాల మధ్య ప్రారంభమైంది. తీర్మానంపై జగన్‌ మాట్లాడేందుకు సిద్ధమవగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల అభ్యంతరం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానం ఇచ్చిన వ్యక్తే తొలుత చర్చ ప్రారంభించాలని అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో వైసీపీ డిప్యూటీ ప్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు చర్చను మొదలుపెట్టారు. తమ పార్టీ తరపున ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతారని చెప్పారు. ఇంతలో యనమల మళ్లీ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రతిపక్షం నుంచి ఒకరు మాట్లాడారు కాబట్టి అధికార పక్షం నుంచి ఇద్దరు మాట్లాడుతారని ఆ తర్వాతే జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. ఇందుకు స్పీకర్ అనుమతిచ్చారు. అయితే ఈ తీరుపై జగన్ అభ్యంతరం వ్యక్తంచేశారు.

గతంలో వాజ్‌పేయి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకురాలైన సోనియా గాంధీ తీర్మానంపై సంతకం పెట్టారా అని జగన్ ప్రశ్నించారు. ఈరోజు అవిశ్వాసంపై మోషన్ మూవ్ చేయడం వెంటనే చర్చకు దిగడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం అందరికీ తెలుసన్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కనీసం సభలో కూడా లేరు చూడండి అంటూ ఎద్దేవా చేశారు. వారిపై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు ఎన్ని ఎత్తులు వేస్తారని జగన్ ప్రశ్నించారు. ఇంతలోనే స్పీకర్ యధా ప్రకారం మైక్ కట్ చేశారు. అది వేరే విషయం అంటూ టీడీపీ సభ్యుడు శ్రవణ్ కుమార్ కు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News