సల్మాన్ ను పెళ్లికి ఒప్పించగల సత్తా అమీర్ కు ఉందా..?
నేను పెళ్లి చేసుకుని .. నా పిల్లలకి ద్రోహాం చేయలేను . ఈ మధ్య తన పెళ్లి గురించి మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నకు సల్మాన్ ఖాన్ చెప్పిన సమాధానం. 50 సంవత్సరాలకు అడుగుడుతున్న సల్లుభాయ్.. ఇప్పుడు పెళ్లి చేసుకున్న పుట్టబోయో బిడ్డలకు మంచి భవిష్యత్ ఇవ్వగల వయసు తనకు ఉండదని ఒక క్లారీటి ఇచ్చాడు. అయితే హీరో అయిన తరువాత సల్మాన్ ఖాన్.. ఎంతో మంది హీరోయిన్స్ ను ప్రేమించడం .. బ్రేకప్ కావడం జరిగిన […]
నేను పెళ్లి చేసుకుని .. నా పిల్లలకి ద్రోహాం చేయలేను . ఈ మధ్య తన పెళ్లి గురించి మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నకు సల్మాన్ ఖాన్ చెప్పిన సమాధానం. 50 సంవత్సరాలకు అడుగుడుతున్న సల్లుభాయ్.. ఇప్పుడు పెళ్లి చేసుకున్న పుట్టబోయో బిడ్డలకు మంచి భవిష్యత్ ఇవ్వగల వయసు తనకు ఉండదని ఒక క్లారీటి ఇచ్చాడు. అయితే హీరో అయిన తరువాత సల్మాన్ ఖాన్.. ఎంతో మంది హీరోయిన్స్ ను ప్రేమించడం .. బ్రేకప్ కావడం జరిగిన విషయం తెలిసిందే. నటి ఐశ్వర్య రాయ్, కత్రీనా కైఫ్ లు కూడా ఆయన గాళ్ ఫ్రెండ్స్ లిస్ట్ లో వున్నారనే విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే.. సల్లుభాయ్ ను పెళ్లికి ఒప్పిస్తానంటున్నాడు ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరైన అమీర్ ఖాన్. పెళ్లి చేసుకోమని ఎప్పుడైన సల్మాన్ కు చెప్పారా అంటే.. ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ తను ప్రయత్నిస్తే సల్మాన్ అంగీకరిస్తాడు అనే భరోసా ఇచ్చారు. మరి నిజంగా అమీర్ ఆ ప్రయత్నంలో ఉంటాడా..? ఈ సీనియర్ బ్యాచిలర్.. అమీర్ ఖాన్ చెప్పిన మాటలు వింటాడా..? కష్టమే అంటున్నారు సల్మాన్ సన్నిహితులు. ఇక సినిమా పరంగా అమీర్ ఖాన్ ఒక ప్రఖ్యాత రేజ్లర్ కోచ్ జీవితం ఆధారంగా ‘దంగల్’ అనే చిత్రం చేస్తున్నారు. ఇద్దరు కూతుర్లను ఎలా జాతీయ ఛాంపియన్స్ గా మలిచాడు అనే ఒక రియల్ లైఫ్ పాయింట్ తో దంగల్ చిత్రం చేస్తున్నారు.