కుర్ర జోడి మధ్య యవ్వారం మొదలైందా..!
బ్యాక్ గ్రౌండ్ బలంగా వుంటే సినిమా ఇండస్ట్రీలో పరిచయం కావడం కొంత ఈజీ అనే చెప్పాలి. అలా అని.. పరిచయం అయిన ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ అవుతారనే గ్యారంటీ కూడా ఏమి లేదు. బ్యాక్ గ్రౌండ్ అనేది లాంచింగ్ పాడ్ మాదరి ఉపయోగ పడుతుంది. అంతకు మించి ఎటువంటి ఉపయోగమూ ఉండదు. ఇప్పుడిదే కోవలోకి బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనికపూర్ తనయుడు అర్జున్ కపూర్.. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి తనయ అతియ షెట్టీ’లు వచ్చారు. […]
బ్యాక్ గ్రౌండ్ బలంగా వుంటే సినిమా ఇండస్ట్రీలో పరిచయం కావడం కొంత ఈజీ అనే చెప్పాలి. అలా అని.. పరిచయం అయిన ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ అవుతారనే గ్యారంటీ కూడా ఏమి లేదు. బ్యాక్ గ్రౌండ్ అనేది లాంచింగ్ పాడ్ మాదరి ఉపయోగ పడుతుంది. అంతకు మించి ఎటువంటి ఉపయోగమూ ఉండదు. ఇప్పుడిదే కోవలోకి బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనికపూర్ తనయుడు అర్జున్ కపూర్.. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి తనయ అతియ షెట్టీ’లు వచ్చారు. వారిద్దరు కలసి సినిమా చేయలేదు కానీ.. ఇద్దరు పీకుల్లోతు ప్రేమలో మాత్రం మునిగి తేలుతున్నారని బి టౌన్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. వరస ప్లాప్స్ తో కెరీర్ పరంగా వెనక బడ్డ అర్జున్ కపూర్… ప్రస్తుతం ' కి అండ్ కా' సినిమాపై బోలెడన్ని ఆశలతో ఉన్నాడు. ‘హీరో’ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన సునీల్ షెట్టి తనయ అతియా కూడా ఇంకా బాలీవుడ్ లో హీరోయిన్ గా పాగా వేసేందుకు బాగానే కష్టపడుతోంది. అయితే ఈ కష్టం నుంచి సేదతీరడానికి వీళ్లు డేటింగ్ ను మొదలుపెట్టినట్టున్నారని బాలీవుడ్ వాసుల టాక్. ఒక వైపు బి టౌన్ ప్రేమ జోడిలు.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ బంధాలు బ్రేకప్ అవుతుంటే.మరి వీళ్ల ముచ్చట ఎంత కాలమో!