సైఫ్ కు విడాకులు ఇవ్వనున్న కరీనా
ఈమధ్య కరిష్మాకపూర్ పెళ్లి పెటాకులైంది. అధికారికంగా ఇద్దరూ విడాకులు తీసుకోనప్పటికీ… మానసికంగా ఇద్దరూ ఎప్పుడో దూరమైపోయారు. ప్రస్తుతం ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు అక్క బాటలోనే చెల్లెలు కరీనా కపూర్ కూడా నడవబోతోంది. తను ఎంతగానో ఇష్టపడి చేసుకున్న సైఫ్ అలీఖాన్ కు విడాకులు ఇస్తానని కరీనా ఓపెన్ గానే ప్రకటించింది. అయితే అది సీరియస్ గా కాదు.. సరదాగానే ఈ వ్యాఖ్యలు చేసింది. అర్జున్ కపూర్ తో కీ అండ్ […]
ఈమధ్య కరిష్మాకపూర్ పెళ్లి పెటాకులైంది. అధికారికంగా ఇద్దరూ విడాకులు తీసుకోనప్పటికీ… మానసికంగా ఇద్దరూ ఎప్పుడో దూరమైపోయారు. ప్రస్తుతం ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు అక్క బాటలోనే చెల్లెలు కరీనా కపూర్ కూడా నడవబోతోంది. తను ఎంతగానో ఇష్టపడి చేసుకున్న సైఫ్ అలీఖాన్ కు విడాకులు ఇస్తానని కరీనా ఓపెన్ గానే ప్రకటించింది. అయితే అది సీరియస్ గా కాదు.. సరదాగానే ఈ వ్యాఖ్యలు చేసింది. అర్జున్ కపూర్ తో కీ అండ్ కా అనే కొత్త సినిమా చేసింది కరీనా. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా… అర్జున్ ను ఆకాశానికెత్తేస్తూ… ఈ వ్యాఖ్యలు చేసింది. నిజంగా తనకు అవకాశం ఉంటే…. సైఫ్ కు విడాకులు ఇచ్చేసి అర్జున్ కపూర్ ను పెళ్లి చేసుకుంటానని సరదాగా బెబో వ్యాఖ్యానించింది. ఆమె సరదాగా కామెంట్ చేసినప్పటికీ… అక్క కరిష్మా నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని… చాలామంది ముక్కునవేలేసుకున్నారు. ప్రమోషన్ కోసం ఇలాంటి కామెంట్స్ చేయడం ఏం బాగోలేదంటూ అప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ లో కథనాలు కూడా వస్తున్నాయి. దీనిపై సైఫ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.