టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీకి షాక్
వైసీపీ నుంచి గెలిచి పది రోజులు కూడా గడవకముందే టీడీపీ కండువా కప్పుకుని అందరికి షాక్ ఇచ్చిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు ఎదురుదెబ్బ తగిలింది. కుల ధృవీకరణ వివాదంలో ఆమెకు తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. ఎంపీ సోదరుడు వివేకానంద కుమార్ ఎస్టీ కాదంటూ విచారణ కమిటీ తేల్చిచెప్పింది. దీంతో కొత్తపల్లి గీత కులంపైనా విచారణ జరగనుంది. అయితే పార్లమెంట్ సమావేశాల కారణంగా విచారణకు హాజరు కాలేనని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్కు సమాచారం అందించారామె. ఆమె […]
వైసీపీ నుంచి గెలిచి పది రోజులు కూడా గడవకముందే టీడీపీ కండువా కప్పుకుని అందరికి షాక్ ఇచ్చిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు ఎదురుదెబ్బ తగిలింది. కుల ధృవీకరణ వివాదంలో ఆమెకు తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. ఎంపీ సోదరుడు వివేకానంద కుమార్ ఎస్టీ కాదంటూ విచారణ కమిటీ తేల్చిచెప్పింది. దీంతో కొత్తపల్లి గీత కులంపైనా విచారణ జరగనుంది. అయితే పార్లమెంట్ సమావేశాల కారణంగా విచారణకు హాజరు కాలేనని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్కు సమాచారం అందించారామె. ఆమె కులంపై పలు కేసులు కూడా నమోదయ్యాయి.
కొత్తపల్లి గీత సోదరుడు వివేకానంద తప్పుడు కులధృవీకరణ పత్రంతో భీమా కంపెనీలో ఉద్యోగం సంపాదించారన్నది ఆరోపణ. ఆతని ఎస్టీ సర్టిఫికెట్‌పై విచారణ జరపాలని గిరిజన సంఘాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. దీనిపై విచారణ జరిగిన తూర్పుగోదావరి జిల్లా అధికారులు వివేకానంద ఎస్టీ కాదని తేల్చేశారు. ఈ విషయంపై ఆయనకు నోటీసులు జారీ చేశారు.
కొత్తపల్లి గీత గిరిజన కులానికి చెందిన వ్యక్తి కాదని, ఆమె ఎన్నికను రద్దు చేయాలని కొద్ది రోజుల క్రితం గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆరోపణలు చేసింది. అరకు ఎంపీగా ఎన్నికైన కొత్లపల్లి గీత గిరిజనురాలు కాదని పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె సోదరుడు ఎస్టీ కాదని తేలడంతో కొత్తపల్లి గీతకు ముప్పు తప్పేలా లేదు.
Click on Image to Read: