ఈ తెలివితేటలను వైఎస్ ప్రదర్శించి ఉంటే...!

”సంక్షోభంలో అవకాశం వెతకడం నాకు అలవాటు”… అని చంద్రబాబు పదేపదే అంటుంటారు.  సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడంతో పాటు తప్పును ఒప్పు చేయడంలోనూ ఆయనకు ఆయనే సాటిగా కనిపిస్తున్నారు. నేరాలపై విచారణ జరిపితే దాని వల్ల రాష్ట్రం ఇమేజ్ దెబ్బతింటుందంటూ ప్రపంచంలో ఎక్కడా ఏ రాజకీయ నాయకుడు తెరపైకి తీసుకరాని ఆంశాన్ని తెచ్చారు. నిజమే …  అమరావతి భూకుంభకోణాలపై విచారణ చేస్తే రాజధాని బ్రాండ్ దెబ్బతింటుంది కదా అన్న భ్రమను జనంలో కల్పించేందుకు అసెంబ్లీనే సమర్థవంతంగా వాడుకోగలిగారు.  అయితే చంద్రబాబు […]

Advertisement
Update:2016-03-10 07:17 IST

”సంక్షోభంలో అవకాశం వెతకడం నాకు అలవాటు”… అని చంద్రబాబు పదేపదే అంటుంటారు. సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడంతో పాటు తప్పును ఒప్పు చేయడంలోనూ ఆయనకు ఆయనే సాటిగా కనిపిస్తున్నారు. నేరాలపై విచారణ జరిపితే దాని వల్ల రాష్ట్రం ఇమేజ్ దెబ్బతింటుందంటూ ప్రపంచంలో ఎక్కడా ఏ రాజకీయ నాయకుడు తెరపైకి తీసుకరాని ఆంశాన్ని తెచ్చారు. నిజమే … అమరావతి భూకుంభకోణాలపై విచారణ చేస్తే రాజధాని బ్రాండ్ దెబ్బతింటుంది కదా అన్న భ్రమను జనంలో కల్పించేందుకు అసెంబ్లీనే సమర్థవంతంగా వాడుకోగలిగారు. అయితే చంద్రబాబు వాదనలో పస ఎంతుందో ఒకసారి చూస్తే…

గతంలో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండేవారు. పత్రిదానికి సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని ఇదే అసెంబ్లీ సాక్షిగా గాండ్రించేవారు. జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్లకూడదన్న ఉద్దేశంతో వైఎస్ పలు అంశాలపై సీబీఐ విచారణకు ఆదేశించారు. అందులో వోక్స్‌ వ్యాగన్, పరిటాల రవి హత్య, ఔటర్ రింగ్‌ రోడ్డు భూ వ్యవహారం ముఖ్యమైనవి. కానీ ఆరోజు చంద్రబాబు లాగే వైఎస్‌ కూడా సీబీఐ విచారణ వల్ల రాష్ట్రం పరువు పోతుందని, హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటుందని వాదించి ఉంటే చంద్రబాబు ఒప్పుకునేవారా?. బాబు మీడియా రాష్ట్ర భక్తితో ఊరుకుండేదా?.

సీబీఐ విచారణ వల్ల రాష్ట్ర ఇమేజ్ దెబ్బతింటుందని చంద్రబాబు చెబుతున్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఒకడు ఓ పది మందిని చంపేసి పారిపోయాడనుకుందాం. లేదంటే మహిళలపై దాడి చేసి పారిపోయాడే అనుకుందాం. ఆ విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమే అయిందనుకుందాం. అప్పుడు కూడా బ్రాండ్ ముఖ్యమంటూ విచారణకు ఆదేశించకుండా తప్పించుకుంటారా?. వేల కోట్ల భూకుంభకోణంపైనే తడి బట్ట కప్పేస్తున్నప్పుడు హత్య కేసులను కూడా దాచి పెట్టరన్న గ్యారెంటీ ఏంటి?. ఏమైనా ఇలాంటి విషయాల్లో బాబు ది గ్రేట్…

Click on image to read:

Tags:    
Advertisement

Similar News