సీతమ్మ కూడా సాంగేసుకుంది

రొటీన్ గా అంజలి కూడా పాట పాడేసింది. అవును… హీరోయిన్లు మైక్ అందుకోవడం రొటీన్ అయిపోయింది. మొన్నటికిమొన్న త్రిష కూడా పాడింది.  ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోయిన్లు పాటలు పాడారు. ఇప్పుడీ కోవలోకి అంజలి కూడా చేరిపోయింది కాబట్టి రోటీన్ అనుకోవాలి. తన కొత్త సినిమా చిత్రాంగద సినిమా కోసం ఆమె మైక్ అందుకుంది. పిల్లజమీందార్ ఫేం అశోక్ తెరకెక్కిస్తున్న ఈ విభిన్న హారర్ చిత్రంలో హారర్ సన్నివేశాలతో పాటు…. అంజలి పాడిన పాట కూడా […]

Advertisement
Update:2016-03-10 04:43 IST
రొటీన్ గా అంజలి కూడా పాట పాడేసింది. అవును… హీరోయిన్లు మైక్ అందుకోవడం రొటీన్ అయిపోయింది. మొన్నటికిమొన్న త్రిష కూడా పాడింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోయిన్లు పాటలు పాడారు. ఇప్పుడీ కోవలోకి అంజలి కూడా చేరిపోయింది కాబట్టి రోటీన్ అనుకోవాలి. తన కొత్త సినిమా చిత్రాంగద సినిమా కోసం ఆమె మైక్ అందుకుంది. పిల్లజమీందార్ ఫేం అశోక్ తెరకెక్కిస్తున్న ఈ విభిన్న హారర్ చిత్రంలో హారర్ సన్నివేశాలతో పాటు…. అంజలి పాడిన పాట కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. అయితే అందరి హీరోయిన్లలా అంజలి కూడా పాట పాడినప్పటికీ… ఆమె పాడిన పాటలో ఒక ప్రత్యేకత మాత్రం ఉంది. హీరోయిన్లంతా ఏదో ఒక భాషలోనే పాట పాడితే…. అంజలి మాత్రం ఒకే పాటను తెలుగు, తమిళ భాషల్లో ఆలపించడం విశేషం. త్వరలోనే ఈ సినిమా ఆడియోను విడుదల చేసి, చిత్రాన్ని వీలైనంత తొందరగా మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నారు.
Tags:    
Advertisement

Similar News