వివాహితని చేయిపట్టి లాగిన మంత్రి రావెల కొడుకు, చితకబాదిన స్థానికులు

ఏపీ మంత్రి రావెల కిషోర్‌ బాబుకు మరో చిక్కు వచ్చి పడింది. ఇప్పటికే అమరావతిలో అక్రమంగా భూములు కొన్న వివాదంలో రావెల కూరుకుపోగా… ఇప్పుడు ఆయన కుమారుడు ఉన్న పరువు కూడా తీసేశాడు.  ఆయన కుమారుడు రావెల సుశీల్ ఒక ఘన  కార్యం చేసి స్థానికుల చేతిలో తన్నులు తిన్నాడు. సాయంత్రం బంజారాహిల్స్‌లో తప్పతాగిన రావెల సుశీల్ ఒక వివాహితను లైంగికంగా వేధించారు. ఆమె చేయి పట్టుకుని లాగాడు. డ్రైవర్‌తో  కలిసి ఈ నీచానికి పాల్పడ్డాడు. దీన్ని గుర్తించిన స్థానికులు […]

Advertisement
Update:2016-03-04 15:12 IST

ఏపీ మంత్రి రావెల కిషోర్‌ బాబుకు మరో చిక్కు వచ్చి పడింది. ఇప్పటికే అమరావతిలో అక్రమంగా భూములు కొన్న వివాదంలో రావెల కూరుకుపోగా… ఇప్పుడు ఆయన కుమారుడు ఉన్న పరువు కూడా తీసేశాడు. ఆయన కుమారుడు రావెల సుశీల్ ఒక ఘన కార్యం చేసి స్థానికుల చేతిలో తన్నులు తిన్నాడు.

సాయంత్రం బంజారాహిల్స్‌లో తప్పతాగిన రావెల సుశీల్ ఒక వివాహితను లైంగికంగా వేధించారు. ఆమె చేయి పట్టుకుని లాగాడు. డ్రైవర్‌తో కలిసి ఈ నీచానికి పాల్పడ్డాడు. దీన్ని గుర్తించిన స్థానికులు రావెల సుశీల్‌ను చితకబాదారు. ఆతడి డ్రైవర్‌పై బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంత్రి కుమారుడిపై మాత్రం కేసు నమోదు చేయలేదు. పైగా మంత్రి కుమారుడిపై దాడి చేశారంటూ పది మంది స్థానికులపై ఎదురు కేసు పెట్టారు. మహిళను వేధించిన సమయంలో వాడిన కారు కూడా మంత్రి రావెలదే. మంత్రి కారును సీజ్ చేశారు.

రావెల సుశీల్ ను తప్పించేందుకు పెద్దలు రంగంలోకి దిగి శతవిధాలా ప్రయత్నించారు. అయితే బాధితురాలు గట్టిగా నిలబడడంతో అసలు విషయం బయటపడింది. చివరకు సుశీల్ పైనా కేసు నమోదైంది. తనను చేయి పట్టుకుని లాగి వేధించిన మంత్రి కుమారుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు మీడియా ముందు చెప్పారు. బాధితురాలు ఒక ముస్లిం మహిళ. ఒంటరిగా వెళ్తున్న మహిళ దగ్గరకు వెళ్లి చేయి లాగిన రావెల సుశీల్ … తనతో రావాలని ఆమెను వేధించాడు. ఈ సమయంలో అక్కడున్న వారు అప్రమత్తమై మంత్రి కుమారుడికి దేహశుద్ధి చేశారు.

Click on image to read:


Tags:    
Advertisement

Similar News