భర్తపై కేసు పెట్టిన కరిష్మాకపూర్

 కరీన కపూర్ అక్క, ఒక్కప్పటి హాట్ హీరోయిన్ కరిష్మాకపూర్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఆమె సినిమాలేం చేయనప్పటికీ… తన వ్యక్తిగత  విషయాలతో హాట్ హాట్ గా మారిపోయింది. భర్తకు విడాకులు ఇవ్వడానికి ఇప్పటికే సిద్ధమైన కరిష్మాకపూర్… తాజాగా అతడిపై హెరాష్ మెంట్ కేసు పెట్టింది. ఇంట్లో తన భర్త, అత్త… తనను మానసికంగా హింసిస్తున్నారంటూ ముంబయిలోని ఖర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి పోలీసులు ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేశారు. అయితే […]

Advertisement
Update:2016-02-28 03:54 IST
కరీన కపూర్ అక్క, ఒక్కప్పటి హాట్ హీరోయిన్ కరిష్మాకపూర్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఆమె సినిమాలేం చేయనప్పటికీ… తన వ్యక్తిగత విషయాలతో హాట్ హాట్ గా మారిపోయింది. భర్తకు విడాకులు ఇవ్వడానికి ఇప్పటికే సిద్ధమైన కరిష్మాకపూర్… తాజాగా అతడిపై హెరాష్ మెంట్ కేసు పెట్టింది. ఇంట్లో తన భర్త, అత్త… తనను మానసికంగా హింసిస్తున్నారంటూ ముంబయిలోని ఖర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి పోలీసులు ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేశారు. అయితే గతంలోనే కరిష్మాకపూర్, ఆమె భర్త విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ఆర్థికపరమైన లావాదేవీలు సెటిల్ కాకపోవడంతో… విడాకుల పత్రాల్ని కరిష్మా విత్ డ్రా చేసుకుంది. దీంతో ఆమె భర్త… కరిష్మాపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. కేవలం డబ్బు కోసమే కరిష్మా తనను పెళ్లి చేసుకుందని ఆరోపించిన ఆయన… తను ఎప్పుడు ఓ మంచి భార్యగా, తల్లిగా, కోడలుగా వ్యవహరించలేదని విమర్శించాడు. మరోవైపు కరిష్మా వ్యవహారంలో తనకు అండర్ వరల్డ్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని… ఈ కేసును ముంబయి నుంచి దిల్లీకి బదిలీ చేయాలని ఆమె భర్త ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం సంచలనం సృష్టించింది. ఈ పరిణామాలన్నీ ఇలా జరుగుతుండగా… తాజాగా తన భర్తపై కరిష్మా కపూర్… గృహహింస కేసు పెట్టడం సంచలనం సృష్టించింది. కరిష్మాకపూర్ కు ఇద్దరు పిల్లలు.
Click on Image to Read:
Tags:    
Advertisement

Similar News