మోడీ పిలుపు...వారికి అందలేదు!
ఒక పక్క భారత్ డిజిటల్ ఇండియాగా మారిపోవాలని, గ్రామగ్రామాల్లో టెక్నాలజీ పెరగాలని భారత ప్రధాని నరేంద్రమోడీ కలలు కంటూ, ప్రచారం చేస్తున్నారు. మరొక పక్క ఆయన సొంత రాష్ట్రం, సొంత జిల్లాలోనే ఆడపిల్లలకు ఫోన్‌ని బ్యాన్ చేస్తూ ఒక గ్రామానికి చెందిన పెద్దలు తీర్మానం చేశారు. పెళ్లికాని యువతులు, చదువుకునే అమ్మాయిలు…వీరందరికీ మొబైల్‌ఫోన్లను ఇవ్వకూడదని, అమ్మాయిల చేతుల్లో సెల్‌ఫోన్లు ఉంటే అది సమాజానికే తలనొప్పిగా, పెద్దసమస్యగా మారుతున్నదని గుజరాత్‌లోని సూరజ్ అనే గ్రామ మండలి సభ్యులు తీర్మానించారు. […]
ఒక పక్క భారత్ డిజిటల్ ఇండియాగా మారిపోవాలని, గ్రామగ్రామాల్లో టెక్నాలజీ పెరగాలని భారత ప్రధాని నరేంద్రమోడీ కలలు కంటూ, ప్రచారం చేస్తున్నారు. మరొక పక్క ఆయన సొంత రాష్ట్రం, సొంత జిల్లాలోనే ఆడపిల్లలకు ఫోన్‌ని బ్యాన్ చేస్తూ ఒక గ్రామానికి చెందిన పెద్దలు తీర్మానం చేశారు.
పెళ్లికాని యువతులు, చదువుకునే అమ్మాయిలు…వీరందరికీ మొబైల్‌ఫోన్లను ఇవ్వకూడదని, అమ్మాయిల చేతుల్లో సెల్‌ఫోన్లు ఉంటే అది సమాజానికే తలనొప్పిగా, పెద్దసమస్యగా మారుతున్నదని గుజరాత్‌లోని సూరజ్ అనే గ్రామ మండలి సభ్యులు తీర్మానించారు. అమ్మాయిలకు సెల్‌ఫోన్లు నిషిద్ధం అనే రూలు పెట్టారు.
ఫోన్లను వారు మద్యంతో సమానంగా పోల్చారు. పెళ్లికాని అమ్మాయిలకు ఫోన్లను ఇస్తే అనేక సమస్యలు వస్తున్నాయని గ్రామపెద్దలు ఎకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదే నిషేధాన్ని స్కూలుకి వెళ్లే అబ్బాయిలకు కూడా త్వరలో విధిస్తామని గ్రామ పెద్ద ఒకరు విలేకర్లతో చెప్పాడు. ఫోన్ల వలన కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు సరిగ్గా చదవడం లేదని, ఇంటిపనులు చేయడం లేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఆ గ్రామ జనాభా 2000.
ఒకవేళ గ్రామపెద్దల మాటని కాదని ఎవరైనా అమ్మాయిలు ఫోన్‌ని వాడుతున్నట్టు తెలిస్తే వారికి 2,100రూ. జరిమానా విధిస్తారు. అలాగే ఫోను వాడుతున్నవారి సమాచారం గ్రామ పెద్దల దృష్టికి తెచ్చినవారికి 200రూ. బహుమానంగా ఇస్తారు. అయితే అమ్మాయిలకు సొంతఫోను ఉండకూడదు కానీ, తమ తల్లిదండ్రుల, బంధువుల ఫోన్లను మాత్రం వాడవచ్చనే సడలింపు ఇచ్చారు.
మోడీ పిలుపు, దేశం మొత్తం సంగతేమో కానీ ఆయన సొంత జిల్లాలోనే అందలేదని దీంతో రుజువైంది. ఎందుకంటే ఇదంతా జరిగిన గ్రామం మెహసానా జిల్లాలో ఉంది. ఇదే జిల్లాలో ప్రధాని నరేంద్రమోడీ జన్మించిన వద్నాగర్ కూడా ఉంది మరి.