ఎన్టీఆర్ ను గిల్లిన నాగార్జున !
సంక్రాంతి రేసులో ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో ఏ రేంజ్ లో హైప్ వచ్చిందో చెప్పనక్కర లేదు. అలాగే డిక్టేటర్ సినిమాకి కూడా బాగానే హైప్ ఇచ్చారు. ఈ రెండు సినిమాలు బడ్జెట్ పరంగా 50 కోట్లకు పై చిలుకు ఖర్చు పెట్టారు. కట్ చేస్తే..ఇదే రేసు లో నాగార్జున నటించిన సొగ్గాడే చిన్నినాయనా చిత్రం కూడా రిలీజ్ అయ్యింది. అయితే బాక్సాఫీస్ ను కొల్లగొడతాయి అని ఆశించిన ఎన్టీఆర్ , బాలయ్య చిత్రాలు బయ్యర్లను కష్టాల […]
సంక్రాంతి రేసులో ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో ఏ రేంజ్ లో హైప్ వచ్చిందో చెప్పనక్కర లేదు. అలాగే డిక్టేటర్ సినిమాకి కూడా బాగానే హైప్ ఇచ్చారు. ఈ రెండు సినిమాలు బడ్జెట్ పరంగా 50 కోట్లకు పై చిలుకు ఖర్చు పెట్టారు. కట్ చేస్తే..ఇదే రేసు లో నాగార్జున నటించిన సొగ్గాడే చిన్నినాయనా చిత్రం కూడా రిలీజ్ అయ్యింది. అయితే బాక్సాఫీస్ ను కొల్లగొడతాయి అని ఆశించిన ఎన్టీఆర్ , బాలయ్య చిత్రాలు బయ్యర్లను కష్టాల పాలు చేసాయనే చెప్పాలి. గుడ్డిలో మెల్ల అన్నచందంగా బాబాయ్ బాలయ్య డిక్టేటర్ కంటే.. అబ్బాయి నాన్నకు ప్రేమతో కొంత వరకు పరవాలేదనిపించింది కానీ.. నాగార్జున సోగ్గాడే చిన్నినాయన చిత్రం మాత్రం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. దాదాపు 50 కోట్లు కలెక్ట్ చేసింది. నిజంగా సినిమా బిజినెస్ అంటే ఇది. ఇందుకు నాగార్జున ప్రేక్షకులకు ధ్యాంక్స్ చెప్పారు. అర్ధశతకం దిశగా పరుగులు పెడుతున్న సందర్భంగా నాగ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటు 50 కోట్లు బడ్జెట్ తో సినిమాలు నిర్మిస్తే.. టాలీవుడ్ లో బడ్జెట్ రికవరీ చేయాలన్నా కష్టమే అని వ్యాఖ్యానించారు.
అయితే నాగార్జున వ్యాఖ్యలు పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను ఉద్దేశించినట్లు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాగార్జున ఇలా మాట్లాడటం బాగోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ చేసి అనవసర వివాదాలను క్రియేట్ చేయొద్దని అంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా…. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలై రూ. 50 కోట్ల షేర్ సాధించిన సంగతి తెలిసిందే. 50 కోట్ల తో చేసిన చిత్రం కనీసం 70 కోట్లు వసూలు చేస్తే గాని.. అసలు వచ్చినట్లు మరి.! అంటే ఈ లెక్కన చూస్తే నాన్నకు ప్రేమతో లాభాలు కాదు ..పెట్టుబడే రాబట్టలేక పోయిందని చెప్పాలి. అయినా గుమ్మడికాయ దొంగలెవరంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకో భుజాలు ఎగరేయడం.