ఆరు నెలల పాటు చేతులెత్తేసిన బాబు- జీవో జారీ

ఏపీలోని కార్పొరేష‌న్ల‌లో జ‌ర‌గాల్సిన ఎన్నిక‌ల‌పై ప్ర‌భుత్వం దాట‌వేత ధోర‌ణిని ఆశ్రయించింది. ఎన్నిక‌ల నిర్వాహ‌ణ‌కు సుముఖంగా లేని ప్ర‌భుత్వం స్పెష‌లాఫీస‌ర్ల పాల‌న‌ను పొడిగిస్తూ జీవోలు జారీ చేసింది. తిరుప‌తి, కాకినాడ‌, గుంటూరు, ఓంగోలు, క‌ర్నూలు కార్పొరేష‌న్ల‌కు 2015 డిసెంబ‌ర్ 31తో ప్ర‌త్యేకాధికారుల పాల‌న గ‌డువు ముగిసింది. అయితే ప్ర‌త్యేకాధికారుల పాల‌నను మ‌రో ఆరు నెల‌ల పాటు పెంచుతూ జీవో ఎంఎస్ 40ని ప్ర‌భుత్వం జారీ చేసింది. తిరుప‌తి కార్పొరేష‌న్ ప్ర‌త్యేకాధికారిగా జిల్లా క‌లెక్ట‌ర్‌ను నియ‌మిస్తూ జీవో ఎంఎస్ 39ను […]

Advertisement
Update:2016-02-17 10:39 IST

ఏపీలోని కార్పొరేష‌న్ల‌లో జ‌ర‌గాల్సిన ఎన్నిక‌ల‌పై ప్ర‌భుత్వం దాట‌వేత ధోర‌ణిని ఆశ్రయించింది. ఎన్నిక‌ల నిర్వాహ‌ణ‌కు సుముఖంగా లేని ప్ర‌భుత్వం స్పెష‌లాఫీస‌ర్ల పాల‌న‌ను పొడిగిస్తూ జీవోలు జారీ చేసింది. తిరుప‌తి, కాకినాడ‌, గుంటూరు, ఓంగోలు, క‌ర్నూలు కార్పొరేష‌న్ల‌కు 2015 డిసెంబ‌ర్ 31తో ప్ర‌త్యేకాధికారుల పాల‌న గ‌డువు ముగిసింది. అయితే ప్ర‌త్యేకాధికారుల పాల‌నను మ‌రో ఆరు నెల‌ల పాటు పెంచుతూ జీవో ఎంఎస్ 40ని ప్ర‌భుత్వం జారీ చేసింది. తిరుప‌తి కార్పొరేష‌న్ ప్ర‌త్యేకాధికారిగా జిల్లా క‌లెక్ట‌ర్‌ను నియ‌మిస్తూ జీవో ఎంఎస్ 39ను జారీ చేసింది ప్ర‌భుత్వం.

రాష్ట్ర విభ‌జ‌న‌తోపాటు కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నందున ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేక‌పోతున్నామ‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. తిరుప‌తి, క‌ర్నూలు, గుంటూరు, ఒంగోలు, కాకినాడ కార్పొరేష‌న్ల‌తో పాటు రాజంపేట‌, కందుకూరు మున్సిపాలిటీల్లోనూ ప్ర‌త్యేకాధికారుల పాల‌న‌ను పొడిగిస్తున్న‌ట్టు జీవోల్లో ప్ర‌క‌టించింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News