ఆ మూడు బాబు ఆస్థాన విద్వాంసులు
ఏపీ తాత్కాలిక రాజధాని నిర్మాణ టెండర్లను అధిక ధరకు ఓకే చేయడాన్ని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. చదరపు అడుగు నిర్మాణానికి మూడు వేల రూపాయలకు పైగా చెల్లించడం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఎక్సెస్ టెండర్లను ఓకే చేయడమే కాకుండా ఇన్సెంటివ్‌లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాత్కాలిక రాజధాని పేరుతో మరో దోపిడికి తెరలేపారని ఆరోపించారు. తాత్కాలిక రాజధాని టెండర్లు సొంతం చేసుకున్న ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ, పల్లోంజీ కంపెనీలు చంద్రబాబు […]
ఏపీ తాత్కాలిక రాజధాని నిర్మాణ టెండర్లను అధిక ధరకు ఓకే చేయడాన్ని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. చదరపు అడుగు నిర్మాణానికి మూడు వేల రూపాయలకు పైగా చెల్లించడం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఎక్సెస్ టెండర్లను ఓకే చేయడమే కాకుండా ఇన్సెంటివ్‌లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాత్కాలిక రాజధాని పేరుతో మరో దోపిడికి తెరలేపారని ఆరోపించారు. తాత్కాలిక రాజధాని టెండర్లు సొంతం చేసుకున్న ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ, పల్లోంజీ కంపెనీలు చంద్రబాబు ఆస్థాన విద్యాంసులని బొత్స ఆరోపించారు. రాష్ట్రంలో పంచభూతాలను పరమాన్నంలా చంద్రబాబు భక్షిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దుబారాను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. పాలనతో విప్లవాత్మక మార్పులు తేవడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కూడా రాజధాని నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉండేందుకు మరో ఎనిమిదేళ్లు ఉండగా హడావుడిగా తాత్కాలిక రాజధాని నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.వెంటనే తాత్కాలిక రాజధాని నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబులాంటి విలాసవంతుడు ప్రపంచంలోనే మరెక్కడా లేరని రఘువీరారెడ్డి అన్నారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ. 1500 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.
Click on Image to Read: