బాలయ్య శత్రువుతో ఎన్టీఆర్ దోస్తీ

 శత్రువుకు శత్రువు అంటే మనకు మిత్రుడే అనే విధంగా వ్యవహరిస్తున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం బాలయ్యతో సరైన సంబంధాలు లేని సమయంలో…. అతనికి ఇష్టంలేని వ్యక్తులందరికీ తారక్ దగ్గరవుతున్నాడు. పరిశ్రమలో బాలకృష్ణ-నాగార్జునకు పడట్లేదనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో జరిగిన కొన్ని విషయాల వల్ల ఆ ఇద్దరు స్టార్ల మధ్య వైరం పెరిగింది. ఇప్పుడు దీన్ని ఎన్టీఆర్ బాగా క్యాష్ చేసుకుంటున్నాడనే విమర్శలు వస్తున్నాయి. నాన్నకు ప్రేమతో విడుదలకు సిద్ధమైన వేళ….. తారక్ నేరుగా వెళ్లి మీలో ఎవరు […]

Advertisement
Update:2016-01-10 02:30 IST
బాలయ్య శత్రువుతో ఎన్టీఆర్ దోస్తీ
  • whatsapp icon
శత్రువుకు శత్రువు అంటే మనకు మిత్రుడే అనే విధంగా వ్యవహరిస్తున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం బాలయ్యతో సరైన సంబంధాలు లేని సమయంలో…. అతనికి ఇష్టంలేని వ్యక్తులందరికీ తారక్ దగ్గరవుతున్నాడు. పరిశ్రమలో బాలకృష్ణ-నాగార్జునకు పడట్లేదనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో జరిగిన కొన్ని విషయాల వల్ల ఆ ఇద్దరు స్టార్ల మధ్య వైరం పెరిగింది. ఇప్పుడు దీన్ని ఎన్టీఆర్ బాగా క్యాష్ చేసుకుంటున్నాడనే విమర్శలు వస్తున్నాయి. నాన్నకు ప్రేమతో విడుదలకు సిద్ధమైన వేళ….. తారక్ నేరుగా వెళ్లి మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో నాగార్జునను కౌగలించుకోవడం…. బాలయ్య ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇదొక్కటే కాదు…. డిస్ట్రిబ్యూషన్, నిర్మాతల నుంచి కూడా బాలయ్యకు పడని వ్యక్తుల్ని ఎన్టీఆర్ దగ్గరకు చేరుస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో బాబాయ్-అబ్బాయ్ మధ్య వైరం పీక్ స్టేజ్ కు వెళ్లిందని అంటున్నారు. ఇదిలా ఉండగా…. మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో గెలిచిన మొత్తాన్ని బాలయ్య, బ్రహ్మణి నడిపిస్తున్న చారిటబుల్ ట్రస్టులకు విరాళంగా ఇచ్చి మరోసారి ఆ ఫ్యామిలీని కెలికాడు ఎన్టీఆర్.
Click to Read:
nagarjuna
Tags:    
Advertisement

Similar News