చండీయాగంలో అగ్నిప్రమాదం, అశుభం కాదంటున్న స్వామీజీలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాచండీయాగంలో అపశృతి ఎదురైంది. యాగశాలలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. హోమంలోని మంటలు యాగశాలకు అంటుకున్నాయి. దీంతో యాగశాల పైభాగం కాలిపోయింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు.  యాగ విరామ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే యాగశాలకు నిప్పు అంటుకోవడం అశుభం కాదని విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. యాగం తర్వాత యాగశాలను దహనం చేయాలని శాస్త్రం చెబుతోందని… అంతకంటే ముందుగానే భగవంతుడే ఆ కార్యక్రమం చేశారని […]

Advertisement
Update:2015-12-27 09:29 IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాచండీయాగంలో అపశృతి ఎదురైంది. యాగశాలలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. హోమంలోని మంటలు యాగశాలకు అంటుకున్నాయి. దీంతో యాగశాల పైభాగం కాలిపోయింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. యాగ విరామ సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

అయితే యాగశాలకు నిప్పు అంటుకోవడం అశుభం కాదని విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. యాగం తర్వాత యాగశాలను దహనం చేయాలని శాస్త్రం చెబుతోందని… అంతకంటే ముందుగానే భగవంతుడే ఆ కార్యక్రమం చేశారని వ్యాఖ్యానించారు.

Click to Read: మోసపోయిన రేవంత్‌

దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని స్థాయిలో కేసీఆర్‌ యాగం నిర్వహించారని కొనియాడారు. అటు రాష్ట్రపతి ఎర్రవెల్లి పర్యటన రద్దు చేసుకున్నారు. అగ్రిప్రమాదం ఘటనతో భద్రతా కారణాల రిత్యా ఆయన తన పర్యటన రద్దు అయింది.


Tags:    
Advertisement

Similar News