మిస్‌ యూనివర్స్‌లో ఘోర తప్పిదం

మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో ఒక వ్యాఖ్యత చేసిన పొరపాటుకు ఆనందభాష్పాలు అరక్షణంలో ఆవిరయ్యాయి. తలను తాకిన మిస్ యూనివర్స్ కీరిటం ఆ అరక్షణంలోనే మరొకరి శిరసును అలంకరించింది. ఇంతకీ ఏం జరిగిందంటే లాస్‌వెగాస్‌లో మిస్ యూనివర్స్‌-2015 పోటీలు గ్రాండ్‌గా జరిగాయి. అన్ని దశల్లో పోటీలు ముగిశాక వ్యాఖ్యాత స్టీవ్‌ హార్వే విజేతను ప్రకటించారు. తొలుత ”మిస్ యూనివర్స్ 2015 ఈజ్‌… మిస్‌ కొలంబియా ఆరియా ద్నా గుటిరీజ్‌ అరెపలో”అంటూ ప్రకటించారు. అంతే ఒక్కసారిగా ఈ ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. […]

Advertisement
Update:2015-12-22 01:34 IST

మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో ఒక వ్యాఖ్యత చేసిన పొరపాటుకు ఆనందభాష్పాలు అరక్షణంలో ఆవిరయ్యాయి. తలను తాకిన మిస్ యూనివర్స్ కీరిటం ఆ అరక్షణంలోనే మరొకరి శిరసును అలంకరించింది. ఇంతకీ ఏం జరిగిందంటే లాస్‌వెగాస్‌లో మిస్ యూనివర్స్‌-2015 పోటీలు గ్రాండ్‌గా జరిగాయి. అన్ని దశల్లో పోటీలు ముగిశాక వ్యాఖ్యాత స్టీవ్‌ హార్వే విజేతను ప్రకటించారు. తొలుత ”మిస్ యూనివర్స్ 2015 ఈజ్‌… మిస్‌ కొలంబియా ఆరియా ద్నా గుటిరీజ్‌ అరెపలో”అంటూ ప్రకటించారు.

అంతే ఒక్కసారిగా ఈ ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. గతేడాది విశ్వసుందరి కిరీటాన్నితాజా విజేత తలపై పొదిగారు. అలా జరిగి అర నిమిషం కూడా కాకముందే వ్యాఖ్యాత తన తప్పును తెలుసుకున్నారు. సారీ మిస్ యూనివర్శ్‌ ” మిస్ కొలంబియా కాదు… మిస్ ఫిలిప్పీన్ పియా అలోంజో” అని ప్రకటించారు. అందరూ షాక్. అప్పటిలో వెయ్యి టన్నుల ఆనందంతో కిరీటం సొంతం చేసుకున్న మిస్ కొలంబియా కంగుతిన్నారు. కీరిటం వారికి ఇచ్చేసి పక్కకు వెళ్లిపోయారు.

Tags:    
Advertisement

Similar News