సన్నీ వన్...మోడీ టెన్!
చాలా పద్ధతిగా క్రమశిక్షణతో, నాగరికులుగా బతకడానికి మనిషి వందల వేల సంవత్సరాలుగా కృషి చేస్తున్నా అతనిలోని బేసిక్ ఇన్‌స్టింక్ట్స్ (సహజాత ప్రవృత్తి) మాత్రం ఏమీ మారలేదని చాలా సందర్భాలు రుజువు చేస్తుంటాయి. గూగుల్ ఇండియా ఈ ఏడాది శోధనల జాబితాను ప్రకటించింది. గూగుల్ సెర్చింగ్‌లో మొదటి పదిస్థానాల్లో ఉన్న భారతీయుల్లో పోర్న్ స్టార్ సన్నీలియోన్ మొదటి స్థానంలో ఉంది. మన ప్రధాని నరేంద్రమోడీ పదవస్థానంలో ఉన్నారు. సల్మాన్ ఖాన్ రెండు, ఎపిజె అబ్దుల్ కలాం మూడు స్థానాల్లో […]
చాలా పద్ధతిగా క్రమశిక్షణతో, నాగరికులుగా బతకడానికి మనిషి వందల వేల సంవత్సరాలుగా కృషి చేస్తున్నా అతనిలోని బేసిక్ ఇన్‌స్టింక్ట్స్ (సహజాత ప్రవృత్తి) మాత్రం ఏమీ మారలేదని చాలా సందర్భాలు రుజువు చేస్తుంటాయి.
గూగుల్ ఇండియా ఈ ఏడాది శోధనల జాబితాను ప్రకటించింది. గూగుల్ సెర్చింగ్‌లో మొదటి పదిస్థానాల్లో ఉన్న భారతీయుల్లో పోర్న్ స్టార్ సన్నీలియోన్ మొదటి స్థానంలో ఉంది. మన ప్రధాని నరేంద్రమోడీ పదవస్థానంలో ఉన్నారు. సల్మాన్ ఖాన్ రెండు, ఎపిజె అబ్దుల్ కలాం మూడు స్థానాల్లో ఉన్నారు. షారుఖ్‌కాన్ ఆరో ప్లేస్ లో ఉన్నారు. ఇంకా కత్రినా కైఫ్ నాలుగు, దీపికా పదుకొనే ఐదు, యోయో హనీసింగ్ ఏడు, కాజల్ అగర్వాల్ ఎనిమిది, ఆలియాభట్ తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఈ పదిమందిలో ఒక్క క్రీడాకారుడు కూడా లేకపోవడం విశేషం.
అయితే సెర్చింగ్‌లో మొదటి పది స్థానాల్లో ఉన్న క్రీడాకారుల్లో మన దేశానికి చెందిన వారే ఆరుగురు ఉండటం విశేషం. క్రికెటర్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా, అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ రెండో ప్లేస్‌లో ఉన్నాడు. సచిన్ టెండుల్కర్ మూడు, ఎమ్మెస్ ధోనీ నాలుగు, పోర్చ్‌గీస్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఐదు… స్థానాల్లో ఉన్నారు. సానియా మీర్జా ఏడు, రోహిత్ శర్మ ఎనిమిది, యువరాజ్ సింగ్ తొమ్మిదో స్థానాల్లో ఉన్నారు.
అత్యధిక సార్లు వెతికిన భారత చలన చిత్రాల్లో మొదటి, పదిస్థానాల్లో మన తెలుగు చిత్రాలు బాహుబలి, శ్రీమంతుడు ఉండటం విశేషం. అత్యంత ప్రజాదరణ పొందిన పాపులర్ అంశాల సెర్చింగ్‌లోనూ బాహుబలి రెండోస్థానంలో ఉంది. ఇక్కడ మొదటి ప్లేస్‌లో ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ 2015 ఉంది. ఇక ఎక్కువమంది వెతికిన అంశాల్లో ఫ్లిప్‌కార్ట్ మొదటి స్థానంలో, ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ రెండో స్థానంలో ఉన్నాయి. ఇందులో మొదటి పది అంశాల్లో ఎస్‌బిఐ, అమెజాన్, స్నాప్‌డీల్, వాట్సప్ తదితరాలు ఉన్నాయి.