ఐఫా నామినేషన్స్‌లో ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ హవా..! 

ఇండియన్ సినిమాల్లో ఐఫా అవార్డులకు ఓ ప్రత్యేకత ఉంది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ పేరుతో 2000వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ అవార్డులు ఇండియన్ సినిమా అవార్డులంటే ఉండే క్రేజ్‌ను ఎక్కడికో తీసుకెళ్ళింది. ఇక ఇప్పటివరకూ బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ఐఫా వేడుక మొదటి సారిగా సౌతిండియన్ సినిమానూ పలకరించేందుకు సిద్ధమవుతోంది. సౌతిండియన్ సినిమాలైన తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ ఇలా నాలుగు భాషలకు చెందిన సినీ ప్రముఖుల సమక్షంలో మొదటి సారి ఐఫా ఉత్సవం […]

Advertisement
Update:2015-11-27 00:36 IST

ఇండియన్ సినిమాల్లో ఐఫా అవార్డులకు ఓ ప్రత్యేకత ఉంది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ పేరుతో 2000వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ అవార్డులు ఇండియన్ సినిమా అవార్డులంటే ఉండే క్రేజ్‌ను ఎక్కడికో తీసుకెళ్ళింది. ఇక ఇప్పటివరకూ బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ఐఫా వేడుక మొదటి సారిగా సౌతిండియన్ సినిమానూ పలకరించేందుకు సిద్ధమవుతోంది. సౌతిండియన్ సినిమాలైన తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ ఇలా నాలుగు భాషలకు చెందిన సినీ ప్రముఖుల సమక్షంలో మొదటి సారి ఐఫా ఉత్సవం డిసెంబర్ నెల మొదటి వారంలో పెద్ద ఎత్తున జరగనుంది.

ఇక ఈ అవార్డు వేడుకకు సంబంధించి వివిధ క్యాటగిరీల్లో నామినేషన్లను ప్రకటించారు. ఇక ఈ నామినేషన్స్‌లో తెలుగు సినీ పరిశ్రమ నుంచి ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ సినిమాలు సత్తా చాటాయి. దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన ‘బాహుబలి’ సినిమా ఐఫా ఉత్సవంలో మొత్తం 14 క్యాటగిరీల్లో నామినేషన్లు సొంతం చేసుకోగా, మహేష్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘శ్రీమంతుడు’ 11 క్యాటగిరీల్లో నామినేషన్లను సొంతం చేసుకుంది. డిసెంబర్ 6నుంచి మూడు రోజుల పాటు హైద్రాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగే ఈ వేడుకలో సౌతిండియన్ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు టాప్ స్టార్స్ హాజరు కానున్నారు.

Tags:    
Advertisement

Similar News