అమీర్‌ఖాన్‌కు మంచు విష్ణు కౌంటర్
భారత్‌తో మత అసహనం పెరుగుతోందని… ఈ పరిస్థితిని చూసి తన భార్య దేశం విడిచివెళ్లిపోదామంటోందంటూ బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ చేసిన వాఖ్యలపై హీరో మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. అమీర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. అభద్రతకు లోనవడానికి మీరేమైనా ఆఫ్గనిస్థాన్‌లో ఉన్నారా అంటూ అమీర్‌ను నిలదీశారు. ఇండియా వదిలివెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అసహనం గురించి పాకిస్తాన్‌లో ఉన్న హిందువులు, అమెరికాలోని ఆఫ్రికన్లను అడగాలని సూచించారు. అసహనం అన్నది ప్రతిచోట ఉందని ఇక్కడ మాత్రం కరుడుగట్టిన మీడియా దాన్ని […]
భారత్‌తో మత అసహనం పెరుగుతోందని… ఈ పరిస్థితిని చూసి తన భార్య దేశం విడిచివెళ్లిపోదామంటోందంటూ బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ చేసిన వాఖ్యలపై హీరో మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. అమీర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. అభద్రతకు లోనవడానికి మీరేమైనా ఆఫ్గనిస్థాన్‌లో ఉన్నారా అంటూ అమీర్‌ను నిలదీశారు. ఇండియా వదిలివెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
అసహనం గురించి పాకిస్తాన్‌లో ఉన్న హిందువులు, అమెరికాలోని ఆఫ్రికన్లను అడగాలని సూచించారు. అసహనం అన్నది ప్రతిచోట ఉందని ఇక్కడ మాత్రం కరుడుగట్టిన మీడియా దాన్ని భూతద్దంలో చూపిస్తోందని విష్ణు అన్నారు. కొందరు ఈడియట్స్ ఈ అసహనం అనే అభద్రతా భావనను సృష్టించారని విష్ణు అన్నారు. అయితే అమీర్ ఖాన్‌పై మంచు విష్ణు మరీఇంత ఓపెన్‌గా అటాక్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అమీర్‌ఖాన్‌పై తనకుఎంతో గౌరవం ఉందని కూడా ట్విట్టర్‌లో విష్ణు చెప్పారు.