మొన్న పూరి జగన్.. ఇప్పుడు వినాయక్.. తర్వాత..?

చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి ఇలా లిస్ట్ ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉంది. తాజాగా అఖిల్ ఫ్లాప్ తో చిరంజీవి 150వ సినిమా మరోసారి డైలమాలో పడింది. అఖిల్ తో వినాయక్ పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు. అంతేకాదు.. ఆ వెంటనే ఓ ప్రకటన కూడా చేశాడు. సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నట్టు ఎనౌన్స్ చేశాడు. దీంతో చిరు 150వ సినిమా మరింత ఆలస్యం కానుంది. అంతేకాదు.. అసలు వినాయక్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాలా వద్దా […]

Advertisement
Update:2015-11-17 00:36 IST
చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి ఇలా లిస్ట్ ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉంది. తాజాగా అఖిల్ ఫ్లాప్ తో చిరంజీవి 150వ సినిమా మరోసారి డైలమాలో పడింది. అఖిల్ తో వినాయక్ పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు. అంతేకాదు.. ఆ వెంటనే ఓ ప్రకటన కూడా చేశాడు. సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నట్టు ఎనౌన్స్ చేశాడు. దీంతో చిరు 150వ సినిమా మరింత ఆలస్యం కానుంది. అంతేకాదు.. అసలు వినాయక్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాలా వద్దా అనే ఆలోచనలో కూడా ఉన్నాడు చిరు.
మొన్నటికి మొన్న పూరి జగన్నాధ్ విషయంలో కూడా ఇలానే జరిగింది. ఫస్టాఫ్ నెరేషన్ మొత్తం పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి పూరీని దారుణంగా తప్పించేశారు. వినాయక్ పేరును అనధికారికంగా ప్రకటించేశారు. కానీ ఇప్పుడు అఖిల్ మూవీ ఫ్లాప్ అవ్వడంతో వినాయక్ ను కూడా తప్పించే ఆలోచనలో ఉందట మెగా కాంపౌండ్. దీంతో చిరంజీవి 150వ సినిమా మరోసారి డైలమాలో పడింది.
వాస్తవానికి ఈ ఏడాదే ప్రారంభం కావాల్సిన ఈ సినిమాను వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేశారు. సంక్రాంతికి 150వ సినిమాకు కొబ్బరికాయ కొట్టే ఆలోచనలో ఉన్నారు. ఇంతలోనే వినాయక్ తప్పుకుంటున్నట్టు వార్తలు రావడంతో మెగాభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. చిరు 150వ సినిమా దర్శకుడు ఎవరనే విషయం ఇప్పుడు మళ్లీ మొదటికొచ్చింది.
Tags:    
Advertisement

Similar News