అఖిల్ కథ ఇదేనా
హైదరాబాద్‌లో ఆడుతూ పాడుతూ తిరిగే.. సాధారణ యువకుడు అద్భుత శక్తులున్న అగ్నిగోళం (జువా)ను తీవ్రవాదుల చేతిలో పడకుండా ప్రపంచాన్ని ఎలా కాపాడాడు? అన్నది సినిమా లైన్. ఈ సినిమాను డ్రాగన్ బాల్ అనే హాలీవుడ్ సినిమా ను కాపీ కొట్టి తీశారని ప్రచారం సాగుతోంది. ఆ సినిమాలో హీరో అతీంద్రియ శక్తులున్న ఓ అగ్నిగోళాన్ని రక్షిస్తాడు. ఇదేలైన్‌తో అఖిల్ సినిమా కూడా ఉంటుందని ఓ టాక్ ఫిలింనగర్‌లో బయల్దేరింది. కాకుంటే పూర్తిగా మన నేటివిటీకి మార్చారని సమాచారం. […]
Advertisement
హైదరాబాద్‌లో ఆడుతూ పాడుతూ తిరిగే.. సాధారణ యువకుడు అద్భుత శక్తులున్న అగ్నిగోళం (జువా)ను తీవ్రవాదుల చేతిలో పడకుండా ప్రపంచాన్ని ఎలా కాపాడాడు? అన్నది సినిమా లైన్. ఈ సినిమాను డ్రాగన్ బాల్ అనే హాలీవుడ్ సినిమా ను కాపీ కొట్టి తీశారని ప్రచారం సాగుతోంది. ఆ సినిమాలో హీరో అతీంద్రియ శక్తులున్న ఓ అగ్నిగోళాన్ని రక్షిస్తాడు. ఇదేలైన్‌తో అఖిల్ సినిమా కూడా ఉంటుందని ఓ టాక్ ఫిలింనగర్‌లో బయల్దేరింది. కాకుంటే పూర్తిగా మన నేటివిటీకి మార్చారని సమాచారం. గతంలో దేవిపుత్రుడు, అంజి, శక్తి సినిమాలు ఇలాంటి కాన్సెప్ట్‌తోనే వచ్చాయి. ఈ సినిమాలేవీ విజయాలు సాధించలేదు. కానీ, అఖిల్ మాత్రం కమర్షియల్‌గా మంచి హిట్ సాధిస్తుందని బలంగా నమ్ముతోంది చిత్రయూనిట్.
టూరిస్ట్ గైడ్‌గా అఖిల్ !
సినిమాలో అఖిల్ టూరిస్ట్ గైడ్ పాత్రలో కనిపిస్తారంట. ఆఫ్రికాలో ఓ గిరిజన గ్రామానికి వెళ్లిన అఖిల్ అనుకోకుండా జువా (అగ్నిగోళం)ను చూస్తాడు. దేవుడి ఆశీస్సులు ఉన్న జాతకంతో జన్మించిన వారు మాత్రమే దాన్ని తాకగలరు. ఇతరులెవరూ ముట్టుకోలేరు. దాని శక్తితో ప్రపంచాన్ని తమ గుప్పిట పెట్టుకోవచ్చు. అంతటి మహిమగలిగిన ఈ జువాను స్థానిక గిరిజనులు ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుతుంటారు. అయితే, అఖిల్ జువాను తాకాడన్న సంగతి తెలుసుకున్న గిరిజనులు అతడిని తమ రక్షకుడిగా భావిస్తారు. కానీ, అఖిల్ ఈలోపు హైదరాబాద్ వచ్చేస్తాడు. అఖిల్ జువాను తాకగలిగాడంటే.. అతని ద్వారా ఎలాగైనా జువాను సాధించాలనుకుంటారు తీవ్రవాదులు. అందుకోసం హీరోయిన్‌ను, గిరిజనులను ఎరగా వేసి అఖిల్‌ని తిరిగి ఆఫ్రికాకు రప్పిస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫ్రికా వెళ్లిన హీరో విలన్లకు బుద్ధి చెప్పి జువాను కాపాడటంతో కథ ముగుస్తుంది.
Advertisement