దుస్తులేసుకుంటే ఎలర్జీ అంటున్న స్టార్ హీరో

బాలివుడ్ హీరో సల్మాన్ ఖాన్ పేరు చెపితే చాలు, అతడి మెలితిరిగిన ఖండలు, సిక్స్ ప్యాక్ బాడీ గుర్తొచ్చి అమాయిల గుండెల్లో గుబులు రేపుతుంటాడు. యాభై యేళ్లు వచ్చినా ఇంకా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ‘ లిస్ట్‌లో అతని పేరు కనపడుతూనే ఉంటోంది.  స్క్రీన్ పైన షర్ట్ విప్పడంలో అతనికతనే సాటి. అదే అతనికి చాలా క్రేజ్ తెచ్చిపెట్టిందనే చెప్పాలి. కాని సల్మాన్ ఖాన్ మాత్రం ‘ తన షర్ట్ లేని వేషాలన్నీ ‘ స్క్రీన్ కోసం […]

Advertisement
Update:2015-11-01 00:33 IST

బాలివుడ్ హీరో సల్మాన్ ఖాన్ పేరు చెపితే చాలు, అతడి మెలితిరిగిన ఖండలు, సిక్స్ ప్యాక్ బాడీ గుర్తొచ్చి అమాయిల గుండెల్లో గుబులు రేపుతుంటాడు. యాభై యేళ్లు వచ్చినా ఇంకా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ‘ లిస్ట్‌లో అతని పేరు కనపడుతూనే ఉంటోంది. స్క్రీన్ పైన షర్ట్ విప్పడంలో అతనికతనే సాటి. అదే అతనికి చాలా క్రేజ్ తెచ్చిపెట్టిందనే చెప్పాలి. కాని సల్మాన్ ఖాన్ మాత్రం ‘ తన షర్ట్ లేని వేషాలన్నీ ‘ స్క్రీన్ కోసం కాదని.. బేసిక్‌గా తనకు, తన తండ్రి సలీం ఖాన్‌కు దుస్తులంటే ఎలర్జీ అని ఉన్న అసలు విషయం చెప్పేసాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరూ.. మినిమం దుస్తులతో తిరుగుతామని.. సినిమాల కోసం నిండుగా దుస్తులేసుకోవడమంటే చిరాకని సల్మాన్ చెప్పడంలో వింతేమీ లేదనుకోవాలి. కావాలంటే ముంబై లోని తన ఇంటికి వచ్చి చూసుకోవచ్చని కూడా ఇటీవల జరిగిన ఒక ఫ్యాషన్ షోలో గుట్టు చెప్పేసాడు.

Tags:    
Advertisement

Similar News