దమ్ము కొట్టిన సమంత: బయ్యర్స్ పరేషాన్

దమ్ము కొట్టడంలో ప్రత్యేక శిక్షణ తీసుకుని మరీ దమ్ము కొట్టింది సమంత. ఇటీవల సమంత నటించిన తమిళ సినిమా ’10 ఎండ్రతుకుల్లా’ రిలీజ్ అయ్యింది. అందులో సమంత డ్యూయల్ రోల్స్ చేసింది. ఒకటేమో రొటీన్ హీరోయిన్ రోల్, ఇంకొకటేమో.. విలన్ టైప్ రోల్. ఆ రోల్ కోసం సమంతా దమ్ము కొట్టే క్లాసెస్ తీసుకుని మరీ యాక్టింగ్ చేసింది. అది చూసి ఆమె మేల్ ఫ్యాన్స్ చాలా ఖుషీ అయిపోయారు. ఆమె వీరాభిమాని ఒకరు.. ఆ సినిమాలో […]

Advertisement
Update:2015-10-31 00:38 IST

దమ్ము కొట్టడంలో ప్రత్యేక శిక్షణ తీసుకుని మరీ దమ్ము కొట్టింది సమంత. ఇటీవల సమంత నటించిన తమిళ సినిమా ’10 ఎండ్రతుకుల్లా’ రిలీజ్ అయ్యింది. అందులో సమంత డ్యూయల్ రోల్స్ చేసింది. ఒకటేమో రొటీన్ హీరోయిన్ రోల్, ఇంకొకటేమో.. విలన్ టైప్ రోల్. ఆ రోల్ కోసం సమంతా దమ్ము కొట్టే క్లాసెస్ తీసుకుని మరీ యాక్టింగ్ చేసింది. అది చూసి ఆమె మేల్ ఫ్యాన్స్ చాలా ఖుషీ అయిపోయారు. ఆమె వీరాభిమాని ఒకరు.. ఆ సినిమాలో సమంతా దమ్ము కొట్టే సీన్ ఉన్న పిక్‌ని క్లిక్ చేసి ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసాడు. తెగ సంతోష పడిపోయిన సమంత.. ఆ ఫొటో్‌ని తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రీట్వీట్ చేసింది. ఆ సినిమా బయ్యర్స్ కి గుండె రగిలిపోయింది. కారణం.. ఆమె అభిమాని షేర్ చేసిన సమంత దమ్ము కొట్టే ఫోటో.. ఒక పైరేటెడ్ ప్రింట్ నుండి క్లిక్ చేసినది. అది గమనించకుండా సమంత పిక్‌ని రీట్వీట్ చేసేసరికి.. స్వయంగా హీరోయిన్ పైరసీని ప్రోత్సహించినట్లు అయ్యిందని బయ్యర్స్ మండిపడుతున్నారు. అత్యుత్సాహంతో ఎవరిని బడితే వారిని ట్విట్టర్‌లో కామెంట్ చేసే సమంత.. ఇప్పుడు తానే గోతిలో పడింది. తస్మాత్ జాగ్రత్త .. మహేష్ సినిమా పోస్టర్ మీద కామెంట్ చేసి ఎంత దుమారం లేపిందో అందరికీ తెలిసిందే. మరి దమ్ము కొట్టే పైరేటెడ్ పిక్ షేర్ చేసి అమ్మడు చేసిందేమిటో!

Tags:    
Advertisement

Similar News