బ్రూస్‌లీ టీంపై ఐటీ అటాక్

రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన బ్రూస్‌లీ చిత్ర యూనిట్ సభ్యుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. దిల్ రాజ్, దానయ్య, తమన్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దర్శకుడు శీను వైట్ల ఇంటిపైనా ఐటీ అటాక్ జరిగింది. వారివారి కార్యాలయాలు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. శుక్రవారం బ్రూస్ లీ జనం ముందుకు రాబోతోంది. ఈ సమయంలో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల క్రితం తమిళ చిత్రం పులి […]

Advertisement
Update:2015-10-15 12:50 IST

రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన బ్రూస్‌లీ చిత్ర యూనిట్ సభ్యుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. దిల్ రాజ్, దానయ్య, తమన్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దర్శకుడు శీను వైట్ల ఇంటిపైనా ఐటీ అటాక్ జరిగింది. వారివారి కార్యాలయాలు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి.

శుక్రవారం బ్రూస్ లీ జనం ముందుకు రాబోతోంది. ఈ సమయంలో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల క్రితం తమిళ చిత్రం పులి విడుదల సమయంలోనూ ఐటీ అధికారులు ఇలాగే దాడుల నిర్వహించారు. పులి విడుదలకు ముందు రోజు హీరో విజయ్, హీరోయిన్లు సమంత, నయనతార ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.

Tags:    
Advertisement

Similar News