ఖైరతాబాద్ గణేష్ లడ్డూను బ్లాక్‌లో అమ్మిన డ్రైవర్

కక్కుర్తికి ఇది పరాకాష్ట. చివరకు ఖైరతాబాద్ వినాయకుడి లడ్డూను వదిలిపెట్టలేదు కొందరు.  స్వామి ప్రసాదాన్ని మార్గమధ్యలో దొంగగా అమ్ముకున్నారు.  ఖైరతాబాద్ వినాయకుడి కోసం తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ వారు 5వేల 600 కిలోల లడ్డూను ప్రసాదంగా పెట్టారు. నిమజ్జనం ముగియడంతో శుక్రవారం ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టగా అందులో కొద్ది భాగాన్ని తిరిగి సురుచి ఫుడ్స్ వారికి పంపించారు.  అయితే ప్రసాదాన్ని తీసుకెళ్తున్న లారీ డ్రైవర్ మార్గ మధ్యలోనే దుకాణం తెరిచాడు.  హయత్‌నగర్ సమీపంలో […]

Advertisement
Update:2015-10-02 14:41 IST

కక్కుర్తికి ఇది పరాకాష్ట. చివరకు ఖైరతాబాద్ వినాయకుడి లడ్డూను వదిలిపెట్టలేదు కొందరు. స్వామి ప్రసాదాన్ని మార్గమధ్యలో దొంగగా అమ్ముకున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి కోసం తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ వారు 5వేల 600 కిలోల లడ్డూను ప్రసాదంగా పెట్టారు. నిమజ్జనం ముగియడంతో శుక్రవారం ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టగా అందులో కొద్ది భాగాన్ని తిరిగి సురుచి ఫుడ్స్ వారికి పంపించారు. అయితే ప్రసాదాన్ని తీసుకెళ్తున్న లారీ డ్రైవర్ మార్గ మధ్యలోనే దుకాణం తెరిచాడు. హయత్‌నగర్ సమీపంలో కొందరు వ్యక్తులకు బ్లాక్‌లో ప్రసాదాన్ని విక్రయించాడు. కవర్లలో పెట్టి అమ్మేశాడు. దీన్ని గమనించిన స్థానికులు తమకూ ప్రసాదం ఇవ్వాలంటూ లారీకి కాసేపు అడ్డుపడ్డారు.

Tags:    
Advertisement

Similar News