సీనియ‌ర్లకు సెల‌వు సంస్కృతి బీజేపీదే!

బీజేపీ త‌ర‌హాలో సీనియ‌ర్లకు సెల‌వు ఇవ్వాల్సిన అవ‌స‌రం త‌మ పార్టీకి లేద‌ని కాంగ్రెస్ మీడియా సెల్ చీఫ్ ర‌ణ‌దీప్ సుర్జీవాలే స్ప‌ష్టం చేశారు. రాహుల్ గాంధీ  త‌న‌కు న‌చ్చిన వారిని పీసీసీ చీఫ్‌లుగా నియ‌మించ‌డంపై సీనియ‌ర్ల నుంచి వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న స్పందించారు. సీనియ‌ర్ల‌ను త‌ప్ప‌నిస‌రి సెల‌వు పేరిట ప‌క్క‌న పెట్టే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాద‌న్నారు. కాంగ్రెస్ పార్టీకి సీనియ‌ర్ల‌తోపాటు, యువ‌త అవ‌స‌రం కూడా స‌మ‌పాళ్ల‌లో ఉంద‌ని తెలిపారు. పార్టీని ముందుకు తీసుకెళ్లే క్ర‌మంలో […]

Advertisement
Update:2015-09-26 07:45 IST
బీజేపీ త‌ర‌హాలో సీనియ‌ర్లకు సెల‌వు ఇవ్వాల్సిన అవ‌స‌రం త‌మ పార్టీకి లేద‌ని కాంగ్రెస్ మీడియా సెల్ చీఫ్ ర‌ణ‌దీప్ సుర్జీవాలే స్ప‌ష్టం చేశారు. రాహుల్ గాంధీ త‌న‌కు న‌చ్చిన వారిని పీసీసీ చీఫ్‌లుగా నియ‌మించ‌డంపై సీనియ‌ర్ల నుంచి వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న స్పందించారు. సీనియ‌ర్ల‌ను త‌ప్ప‌నిస‌రి సెల‌వు పేరిట ప‌క్క‌న పెట్టే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాద‌న్నారు. కాంగ్రెస్ పార్టీకి సీనియ‌ర్ల‌తోపాటు, యువ‌త అవ‌స‌రం కూడా స‌మ‌పాళ్ల‌లో ఉంద‌ని తెలిపారు. పార్టీని ముందుకు తీసుకెళ్లే క్ర‌మంలో రాహుల్‌కు సీనియ‌ర్ల‌తోపాటు, యువ‌త శ‌క్తి అవ‌స‌రం ఉందని వ్యాఖ్యానించారు. రాహుల్ పీసీసీ నాయ‌కులుగా నియ‌మించిన వారంతా స‌మ‌ర్థులేన‌ని చెప్పారు. సీనియ‌ర్లంతా వారిని సోనియా-రాహుల్‌తో స‌మానంగా గౌర‌విస్తున్నార‌ని వివ‌రించారు. బీజేపీ త‌ర‌హాలో ఎల్‌కే అద్వాణి, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషీ ని బీజేపీ మార్గ‌ద‌ర్శ‌క మండ‌లి స‌భ్యుల పేరిట ప‌క్క‌న పెట్ట‌లేద‌ని విమ‌ర్శించారు.
Also Read : రాహుల్ దారిత‌ప్పిన పిల్లాడు
Tags:    
Advertisement

Similar News