విడాకులకు ప్రయత్నిస్తున్న సుదీప్
ఈగ, బాహుబలి సినిమాలతో పాపులర్ అయిన కన్నడ నటుడు సుదీప్, ఇప్పుడు తన వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఈ సీనియర్ హీరో ఇప్పుడు విడాకులకు అప్లై చేశాడు. 14 ఏళ్ల పాటు కాపురం చేసిన తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దీనికి సంబంధించి సుదీప్ భార్య ప్రియా రాధాకృష్ణన్ కూడా సుముఖంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. విడాకుల సందర్భంగా ప్రియకు 19 కోట్ల రూపాయల భరణం ఇచ్చేందుకు సుదీప్ అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో […]
Advertisement
ఈగ, బాహుబలి సినిమాలతో పాపులర్ అయిన కన్నడ నటుడు సుదీప్, ఇప్పుడు తన వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఈ సీనియర్ హీరో ఇప్పుడు విడాకులకు అప్లై చేశాడు. 14 ఏళ్ల పాటు కాపురం చేసిన తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దీనికి సంబంధించి సుదీప్ భార్య ప్రియా రాధాకృష్ణన్ కూడా సుముఖంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. విడాకుల సందర్భంగా ప్రియకు 19 కోట్ల రూపాయల భరణం ఇచ్చేందుకు సుదీప్ అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు కూతురికి గార్డియన్ గా కూడా ఉండేదుకు అంగీకరించినట్టు సమాచారం. సుదీప్-ప్రియకు 11 ఏళ్ల పాప ఉంది. సుదీప్ కూతురు పేరు శాన్వి. అసలు ఈ జంట విడాకులు ఎందుకు తీసుకుంటున్నారనే విషయం మాత్రం స్పష్టంకాలేదు.
Advertisement