ముంబై సబర్బన్ రైళ్ళ పేలుళ్లలో దోషులు 12 మంది
ముంబయి సబర్బన్ రైళ్ళలో 2006లో సంభవించిన బాంబు పేలుళ్ళ కేసులో 12 మందిని ముంబయి న్యాయస్థానం దోషులుగా నిర్దారించింది. ఈ కేసులో మొత్తం 13 మందిని దోషులుగా భావించి విచారించగా అబ్దుల్ వహీద్ షేక్ అనే నిందితుడ్ని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. మిగిలిన 12 మందికీ నేరంతో సంబంధం ఉందని స్పష్టం చేసింది. 2006 జూలై 11న ముంబై రైళ్లలో బాంబు పేలుళ్లు జరిగాయి. 11 నిమషాల వ్యవధిలో ఏడుసార్లు బాంబు పేలుళ్ళు సంభవించాయి. […]
Advertisement
ముంబయి సబర్బన్ రైళ్ళలో 2006లో సంభవించిన బాంబు పేలుళ్ళ కేసులో 12 మందిని ముంబయి న్యాయస్థానం దోషులుగా నిర్దారించింది. ఈ కేసులో మొత్తం 13 మందిని దోషులుగా భావించి విచారించగా అబ్దుల్ వహీద్ షేక్ అనే నిందితుడ్ని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. మిగిలిన 12 మందికీ నేరంతో సంబంధం ఉందని స్పష్టం చేసింది. 2006 జూలై 11న ముంబై రైళ్లలో బాంబు పేలుళ్లు జరిగాయి. 11 నిమషాల వ్యవధిలో ఏడుసార్లు బాంబు పేలుళ్ళు సంభవించాయి. ఉగ్రవాదులు ఆర్డీఎ ఉపయోగించి ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. మొత్తం ఏడు పేలుళ్లు సంభవించగా…అన్నీ ఫస్ట్ క్లాస్ బోగీల్లోనే జరిగాయి. ఈ బాంబు పేలుళ్లలో 189 మంది మృతి చెందగా 829 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు తొమ్మిదేళ్ళపాటు సాగిన విచారణలో 192 మంది సాక్షులను కోర్టు ప్రశ్నించింది. వీరిలో ఐఏఎస్., ఐపీఎస్., రక్షణ, న్యాయ శాఖ, వైద్యాధికారులు కూడా ఉన్నారు. ఈరోజు వెల్లడించిన తీర్పులో పేలుళ్లలో 12 మందిని దోషులుగా తేల్చుతూ కోర్టు తీర్పు చెప్పింది. వీరందరికీ సోమవారం శిక్షలు ఖరారు చేయనుంది.
Advertisement