పోషకాహారంపై షిల్పాశెట్టి పుస్తకం నవంబరులో!
పోషకాహారంపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి రాస్తున్న పుస్తకం పూర్తి కావొచ్చింది. ఇప్పటికే యోగాపై పుస్తకాన్ని విడుదల చేసిన శిల్పాశెట్టి పోషకాహారంపై మరో పుస్తకాన్ని విడుదల చేయనుండటం విశేషం. దీన్ని నవంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని షిల్పాశెట్టి స్వయంగా విలేకరుల సమావేశంలో ప్రకటించారు. పోషకాహారంపై నేను రాస్తున్న పుస్తకం పూర్తయింది. ఈ-బే, బిగ్డీల్ టీవీలతో కలిసి ఈ పుస్తకాన్ని నవంబరులో విడుదల చేస్తా! అయితే దీని పేరును ఇప్పుడే వెల్లడించలేను అని తెలిపారు. చక్కటి […]
Advertisement
పోషకాహారంపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి రాస్తున్న పుస్తకం పూర్తి కావొచ్చింది. ఇప్పటికే యోగాపై పుస్తకాన్ని విడుదల చేసిన శిల్పాశెట్టి పోషకాహారంపై మరో పుస్తకాన్ని విడుదల చేయనుండటం విశేషం. దీన్ని నవంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని షిల్పాశెట్టి స్వయంగా విలేకరుల సమావేశంలో ప్రకటించారు. పోషకాహారంపై నేను రాస్తున్న పుస్తకం పూర్తయింది. ఈ-బే, బిగ్డీల్ టీవీలతో కలిసి ఈ పుస్తకాన్ని నవంబరులో విడుదల చేస్తా! అయితే దీని పేరును ఇప్పుడే వెల్లడించలేను అని తెలిపారు. చక్కటి ఆరోగ్యాన్ని కోరుకునే ప్రతి ఉత్సాహవంతులకు ఇది తప్పకుండా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడేళ్ల మా బాబుతో, నా వ్యాపారాలతో నాకు క్షణం తీరిక దొరకటం లేదు, ఇప్పట్లో వెండితెరపై కనిపించే ఆలోచన లేదని చెప్పారు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్తోపాటు, తాజాగా అక్షయ్ కుమార్తో కలిసి బిగ్ డీల్ టీవీ, తదితర వ్యాపారాల్లో సహభాగస్వామిగా ఉన్న షిల్పాశెట్టి కొంతకాలంగా వెండితెరకు దూరమైన సంగతి తెలిసిందే!
Advertisement