ఐదుగురు పిల్ల‌లున్నారా?  రూ.2 ల‌క్ష‌లు మీవే!

దేశంలో హిందువుల జ‌నాభా ప‌డిపోతోంద‌ని మ‌హారాష్ట్ర‌లోని శివ‌సేన పార్టీ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ప్ర‌తి ఇంటిలో ఐదుగురి చొప్పున క‌నాల‌ని హిందూ దంప‌తులకు  పిలుపునిచ్చింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన మతపర జనాభాలో హిందువుల సంఖ్య తగ్గడంపై శనివారం శివసేన ఆందోళన వ్యక్తంచేసింది. హిందూ జనాభాను ప్రోత్సహించడంలో భాగంగా బహుమతిని ప్రకటించినట్లు ఆ పార్టీ నేత‌ వీను లావణ్య చెప్పారు. 2010-15 మధ్య ఐదుగురు పిల్లలున్న ప్రతి హిందూ కుటుంబం రూ.2 లక్షల బహుమతి పొందడానికి అర్హులని అన్నారు. […]

Advertisement
Update:2015-08-30 09:04 IST
దేశంలో హిందువుల జ‌నాభా ప‌డిపోతోంద‌ని మ‌హారాష్ట్ర‌లోని శివ‌సేన పార్టీ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ప్ర‌తి ఇంటిలో ఐదుగురి చొప్పున క‌నాల‌ని హిందూ దంప‌తులకు పిలుపునిచ్చింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన మతపర జనాభాలో హిందువుల సంఖ్య తగ్గడంపై శనివారం శివసేన ఆందోళన వ్యక్తంచేసింది. హిందూ జనాభాను ప్రోత్సహించడంలో భాగంగా బహుమతిని ప్రకటించినట్లు ఆ పార్టీ నేత‌ వీను లావణ్య చెప్పారు. 2010-15 మధ్య ఐదుగురు పిల్లలున్న ప్రతి హిందూ కుటుంబం రూ.2 లక్షల బహుమతి పొందడానికి అర్హులని అన్నారు. తల్లిదండ్రులు మున్సిపాలిటీ జారీచేసిన జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. శివ‌సేన ప్ర‌క‌ట‌న‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొంద‌రు శివ‌సేన నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తుండ‌గా..మ‌రికొంద‌రు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News