ప్లాప్ డైరెక్ట‌ర్ కి రవితేజ గ్రీన్ సిగ్నెల్..!

ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ కే  పెద్ద పీట వేస్తారు.  భూమి సూర్య‌డి చుట్టూ తిరిగిన‌ట్లు..   ఇండ‌స్ట్రీ అంతా  స‌క్సెస్ చుట్టే తిర‌గుతుంటుంది. ఇక హీరోలు ప్లాప్ డైరెక్ట‌ర్ ను ట‌చ్ చేయాలంటే భ‌య ప‌డ‌తారు.   అయితే మాస్ రాజా ర‌వితేజ మాత్రం నా ట్రాకే సెపరేట్ అంటున్నారు. స‌క్సెస్ , ఫెయిల్యూర్స్ అనేవి కెరీర్ లో ఒక భాగం మాత్ర‌మే అనే చందంగా ఆయ‌న   ట్రీట్ చేస్తున్నారు. మ్యాట‌రేంటంటే.. స్వామిరారా చిత్రంతో   డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మైన    సుధీర్ వ‌ర్మ ..ఈ […]

Advertisement
Update:2015-08-24 05:36 IST

ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ కే పెద్ద పీట వేస్తారు. భూమి సూర్య‌డి చుట్టూ తిరిగిన‌ట్లు.. ఇండ‌స్ట్రీ అంతా స‌క్సెస్ చుట్టే తిర‌గుతుంటుంది. ఇక హీరోలు ప్లాప్ డైరెక్ట‌ర్ ను ట‌చ్ చేయాలంటే భ‌య ప‌డ‌తారు. అయితే మాస్ రాజా ర‌వితేజ మాత్రం నా ట్రాకే సెపరేట్ అంటున్నారు. స‌క్సెస్ , ఫెయిల్యూర్స్ అనేవి కెరీర్ లో ఒక భాగం మాత్ర‌మే అనే చందంగా ఆయ‌న ట్రీట్ చేస్తున్నారు.

మ్యాట‌రేంటంటే.. స్వామిరారా చిత్రంతో డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మైన సుధీర్ వ‌ర్మ ..ఈ చిత్రంతో మంచి హిట్ తో పాటు.. డైరెక్ట‌ర్ గా త‌న ప‌నిత‌నంతో ఇండ‌స్ట్రీ ని త‌న వైపు ఆలోచింప చేసేలా చేశాడు. అయితే ఈ యేడాది నాగ‌చైత‌న్య తో చేసిన సెకండ్ ఫిల్మ్ దోచేయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా ప‌డ‌టంతో.. సుధీర్ వ‌ర్మ కు రివ‌ర్స్ గేర్ ప‌డింది. దీంతో ఈ డైరెక్ట‌ర్ ను ప‌ట్టించుకునే వారే లేక పోయారు… అయితే ర‌వితేజ కు ఈ మ‌ధ్య ఒక క‌థ చెప్పార‌ట డైరెక్ట‌ర్ . ర‌వితేజ‌కు డైరెక్ట‌ర్ చెప్పిన స్టోరి న‌చ్చ‌డంతో రెడి చేసుకోమ‌న్నార‌ట‌. ఇది నిజంగా సుధీర్ వ‌ర్మ కు హ్యాపిన్యూసే మ‌రి. కేవ‌లం ఒక సినిమా ఫెయిల్యూర్ అయితే.. ఆ డైరెక్ట‌ర్ ఇక స‌క్సెస్ అందుకోలేడు అని భావిస్తే..? ఏ టెక్నిషియ‌న్ తిరిగి స‌క్సెస్ ట్రాక్ మీద‌కు రాలేడు. ఈ విష‌యం ర‌వి తేజ కు తెలుసు..ఎందుకంటే. కెరీర్ లో ఫిల్మ బ్యాగ్రౌండ్ ఏమి లేకుండా.. ఎన్నో ఒడి దుడుకులు ఎదుర్కొంటూ ఒక సూప‌ర్ స్టార్ రేంజ్ కు రీచ్ అయిన వ్య‌క్తి క‌దా..! ఎనీ వే ప్ర‌స్తుతం కిక్ 2 తో అల‌రిస్తున్న ర‌వితేజ‌..సుధీర్ వర్మ తో ఏ త‌ర‌హా చిత్రం చేస్తాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.

Tags:    
Advertisement

Similar News