ప్రభుత్వ చీప్‌ లిక్కర్‌తో ఆరోగ్యం చెడిపోదా: నాగం

గుడుంబా తాగితే అనారోగ్యం పాలైతే… చీప్‌లిక్కర్‌ తాగితే ఆరోగ్యం చెడిపోదా అని మాజీమంత్రి, తెలంగాణ బచావో మిషన్‌ వ్యవస్థాపకులు నాగం జనార్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ బచావో మిషన్‌ కార్యాలయాన్ని నాగం ప్రారంభించారు. కేసీఆర్‌ ఏడాదిలో మూడుసార్లు కాన్వాయ్‌ మార్చారని, మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణను పేద రాష్ట్రంగా మార్చారని ఆయన ఆరోపించారు. సెక్రటేరియెట్‌ను కూలగొట్టి బుర్జ్‌ఖలీఫా లాంటివి కట్టిస్తామంటున్నారని ఆయన విమర్శించారు. స్థానికతను వివాదం చేశారని, సంక్షేమపథకాలకు నిధులు కోత పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ‌ ప్ర‌జ‌ల […]

Advertisement
Update:2015-08-19 06:40 IST
గుడుంబా తాగితే అనారోగ్యం పాలైతే… చీప్‌లిక్కర్‌ తాగితే ఆరోగ్యం చెడిపోదా అని మాజీమంత్రి, తెలంగాణ బచావో మిషన్‌ వ్యవస్థాపకులు నాగం జనార్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ బచావో మిషన్‌ కార్యాలయాన్ని నాగం ప్రారంభించారు. కేసీఆర్‌ ఏడాదిలో మూడుసార్లు కాన్వాయ్‌ మార్చారని, మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణను పేద రాష్ట్రంగా మార్చారని ఆయన ఆరోపించారు. సెక్రటేరియెట్‌ను కూలగొట్టి బుర్జ్‌ఖలీఫా లాంటివి కట్టిస్తామంటున్నారని ఆయన విమర్శించారు. స్థానికతను వివాదం చేశారని, సంక్షేమపథకాలకు నిధులు కోత పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ‌ ప్ర‌జ‌ల అండగా ఉండడం కోస‌మే తెలంగాణ బ‌చావో మిష‌న్ ప్రారంభిస్తున్న‌ట్లు నాగం చెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌లు టీఆర్‌ఎస్‌ను పూర్తి మెజార్టీతో గెలిపించినా, ప్ర‌భుత్వం స్వ‌చ్ఛ‌మైన పాల‌న అందించ‌డంలో విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్ర‌భుత్వం కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్ల‌కుండా పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయాల‌ని, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో రూ. 905 కోట్లు ఖ‌ర్చు చేస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్త‌వుతాయ‌ని, రూ.15 వేల కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలోని ప్రాజెక్టుల‌న్నీ పూర్త‌వుతాయ‌ని ఆయ‌న అన్నారు.
Tags:    
Advertisement

Similar News