అధ్యక్ష రేసులో ఎర్రబెల్లి, రేవంత్, రమణ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీపీ కాస్త డీలా పడింది. తెలుగుదేశం నుంచి అధికార పార్టీలోకి వలసలతో పాటు పార్టీ జాతీయఅధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వంటి నేతలు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీశ్రేణుల్లో నైరాశ్యం కమ్ముకుంది. ఈ పరిస్థితి నుంచి పార్టీని గట్టెక్కించాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసం పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించడంతో పాటు పార్టీ […]
Advertisement
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీపీ కాస్త డీలా పడింది. తెలుగుదేశం నుంచి అధికార పార్టీలోకి వలసలతో పాటు పార్టీ జాతీయఅధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వంటి నేతలు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీశ్రేణుల్లో నైరాశ్యం కమ్ముకుంది. ఈ పరిస్థితి నుంచి పార్టీని గట్టెక్కించాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసం పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించడంతో పాటు పార్టీ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఏర్పడింది. పార్టీ అధ్యక్ష రేసులో టీ.టీడీపీ శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్‌రెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు ఎల్.రమణ ఉన్నారు. వారితో పాటు మరో ముఖ్యనేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొనడంతో పాటు పార్టీలో నూతనోత్సాహం నింపే వ్యక్తిని బాబు అధ్యక్షుడుగా నియమించాలని కార్యకర్తలు కోరుతున్నారు.
Advertisement