ఎర్రకోట వద్ద ప్రధానికి ఏడంచెల భద్రత
దేశ రాజధాని ఢిల్లీలో రేపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు జరిగే ఎర్రకోట వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ఏడంచెల భద్రత వలయాన్ని ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు సమయంలో దేశంపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు సిద్ధపడుతున్నారని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ భారత్‌లో విధ్వంసానికి కుట్ర పన్నుతోందని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌కు ప్రయాణించే ఎయిరిండియా విమానాలను పేల్చేసేందుకు ఐఎస్‌ఐ వర్గాలు యోచిస్తున్నట్టు […]
Advertisement
దేశ రాజధాని ఢిల్లీలో రేపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు జరిగే ఎర్రకోట వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ఏడంచెల భద్రత వలయాన్ని ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు సమయంలో దేశంపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు సిద్ధపడుతున్నారని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ భారత్‌లో విధ్వంసానికి కుట్ర పన్నుతోందని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌కు ప్రయాణించే ఎయిరిండియా విమానాలను పేల్చేసేందుకు ఐఎస్‌ఐ వర్గాలు యోచిస్తున్నట్టు కూడా తెలిసింది. అలాగే పాలకపక్షం బీజేపీ కార్యాలయాలపై దాడులు జరిగే అవకాశం ఉంది. అందువల్ల పార్టీ కార్యాలయం వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఉగ్రవాదులు దేశంలో వాయు, జల మార్గాల్లో చొరబడే ప్రమాదం ఉందని హోంశాఖ వర్గాలు హెచ్చరించాయి. పారా గ్లైడర్ల ద్వారానో, స్మగర్ బోట్ల ద్వారానో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించవచ్చని తెలుస్తోంది. హోంశాఖ నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
Advertisement