ఫేస్ బుక్ తో షారుక్ డీల్...!

ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న సోష‌ల్ నెట్ వ‌ర్క్ ఫేస్ బుక్ ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా ..షారుక్ ఖాన్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఫేస్ బుక్ మెన్ష‌న్స్ పేరు తో ఫేస్ బుక్ సెలిబ్రిటీల కోసం ఒక యాప్ ను త‌యారు చేసింది. ఈ యాప్ ను ఇండియాలో ఇప్పుడే ప్ర‌వేశ పెట్టింది. కేవ‌లం సెలిబ్రిటీల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉండే ఈ యాప్ ప్ర‌చారానికి షారుక్ ఖాన్ ను బ్రాండ్ అంబాసీడ‌ర్ గా నియ‌మించుకుంది. ఈ యాప్ […]

Advertisement
Update:2015-08-12 15:50 IST

ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న సోష‌ల్ నెట్ వ‌ర్క్ ఫేస్ బుక్ ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా ..షారుక్ ఖాన్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఫేస్ బుక్ మెన్ష‌న్స్ పేరు తో ఫేస్ బుక్ సెలిబ్రిటీల కోసం ఒక యాప్ ను త‌యారు చేసింది. ఈ యాప్ ను ఇండియాలో ఇప్పుడే ప్ర‌వేశ పెట్టింది. కేవ‌లం సెలిబ్రిటీల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉండే ఈ యాప్ ప్ర‌చారానికి షారుక్ ఖాన్ ను బ్రాండ్ అంబాసీడ‌ర్ గా నియ‌మించుకుంది. ఈ యాప్ ద్వారా సెలిబ్రీటీలు ఎప్ప‌టికప్పుడు తాము ఏమి చేస్తున్న‌ది వీడియోల ద్వారా త‌మ అభిమానుల‌తో పంచుకోవ‌చ్చు. మొత్తం మీద ఈ యాప్ ను ఇండియాలో ఉప‌యోగిస్తున్న మొట్ట‌మొద‌టి సెలిబ్రిటి షారుక్ ఖాన్ అన్న‌మాట‌.

ఈ యాప్ ప్ర‌చారంలో భాగంగా 15 వీడియోలు షారుక్ పోస్ట్ చేశార‌ట‌. అందులో షారుక్ అభిమానుల‌కు త‌న త‌దుప‌రి చిత్రం ఫ్యాన్ సెట్స్ ని చిత్ర యూనిట్ ను ప‌రిచ‌యం చేశారు. త‌న‌ని ఫ్యాన్ గా చూపిస్తున్న ఆస్కార్ విజేత అయిన మేక‌ప్ మెన్ గ్రెగ్ క్యాన‌మ్ ని కూడా ఆయ‌న ప‌రిచ‌యం చేశాడు. మొత్తం మీద సినిమా సెలిబ్రిటీలు తాము న‌టిస్తున్న చిత్రాల్ని ప్ర‌చారం చేసుకోవ‌డానికి ఫేస్ బుక్ మెన్ష‌న్స్ యాప్ ఒక బ్ర‌హ్మ‌స్ర్తం అయ్యేలా ఉందంటున్నారు టెక్నిక‌ల్ ఎక్ట్స్ ప‌ర్ట్స్.

Tags:    
Advertisement

Similar News